విషాదం.. స్నానాల గదిలో నటి ఆత్మహత్య.. కారణం తెలిస్తే షాక్..

అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఒక కూతురు పుట్టింది. కానీ మనస్పర్థల కారణంగా కొంతకాలానికే విడిపోయారు. కొంతకాలానికి రేఖ మరో వ్యక్తి కాజ వాసి చైతన్యనురెండో పెళ్లి చేసుకుంది.

news18-telugu
Updated: July 23, 2020, 8:09 AM IST
విషాదం.. స్నానాల గదిలో నటి ఆత్మహత్య.. కారణం తెలిస్తే షాక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె అందరిలానే సగటు యువతి. నటి కావాలనే తన కోరికను ఏలాగైనా సాకారం చేసుకోవాలనుకుంది. అందుకోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చింది. కోటి ఆశలతో జీవితాన్ని ప్రారంభించింది. నటిగా అవకాశాలు దక్కాయి. కానీ రెండు టీవీ సిరియల్స్‌లో నటించింది. అనంతరం అందరిలాగే అవకాశాలు రాకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. పలు కారణాలతో మొదటి భర్త నుంచి విడిపోయింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అక్కడ కలసిరాక.. వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఎటూ చూసినా జీవితం అంధకారంగా కన్పించడంతో ఇక తాను బతికి లాభం లేదనుకుంది. కళ్ల ముందు నవ్వుతూ తిరుగుతున్న కూతురు.. మరో వైపు ఆర్థిక ఇబ్బందులు.. కానీ ఆమె నిర్ణయం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యనే ఎంచుకుంది. ఇంటిలోని స్నానాల గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా విద్యానగర్‌కు చెందిన మద్దెల సబీరా అలియాస్ రేఖ(42) నటి, గాయనిగా రాణించాలనే ఉద్దేశంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లింది.

అనుకున్నట్టుగానే రెండు టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరుకు వచ్చింది. అనంతరం అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఒక కూతురు పుట్టింది. కానీ మనస్పర్థల కారణంగా కొంతకాలానికే విడిపోయారు. కొంతకాలానికి రేఖ మరో వ్యక్తి కాజ వాసి చైతన్యనురెండో పెళ్లి చేసుకుంది. ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలకు యాంకరింగ్ చేస్తూ.. పాటలు పాడుతూ విద్యానగర్‌లో జీవనం సాగిస్తూ వస్తోంది. గత రెండు సంవత్సరాలుగా రేఖ పాటలు పాడడం మానేసింది. భర్త చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అందులో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో రేఖ తీవ్ర మానసిక వేదనకు గురై పూర్తిగా కుంగిపోయింది.

ఈ క్రమంలో బుధవారం ఇంట్లోని స్నానాల గదికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అయితే స్నానాల గదిలోకి వెళ్లిన భార్య రేఖ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో చైతన్య పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్నానాల గది తలుపులు పగలగొట్టి చూడగా రేఖ అప్పటికే ఉరేసుకుని వేలాడుతూ కన్పించింది. దీంతో మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 23, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading