కేటీఆర్ పేరు వాడుకుని క్రికెట్ ప్లేయర్ మోసాలు...

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేరు చెప్పి ఓ క్రికెట్ ప్లేయర్ మోసాలకు పాల్పడుతున్నాడు. బాధితులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 7:34 PM IST
కేటీఆర్ పేరు వాడుకుని క్రికెట్ ప్లేయర్ మోసాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేరు చెప్పి ఓ క్రికెట్ ప్లేయర్ మోసాలకు పాల్పడుతున్నాడు. బాధితులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నాగరాజు అనే ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డి పేరు చెప్పి దందాలు మొదలు పెట్టాడు. ఫిబ్రవరి 9న కేటీఆర్ సీఎం కాబోతున్నారని, ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేస్తారని కూడా నమ్మించారు. ‘నాగరాజు అనే నిరుపేద ప్లేయర్ ఇండియా టీమ్ అండర్ 25 వరల్డ్ కప్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ లకు సెలెక్ట్ అయ్యడంటూ.. తన గురించే చెప్పుకుంటూ మోసం చేశాడు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి 3లక్షల టోకరా వేశాడు. దీంతో పాటు ఫిబ్రవరి 9 న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని..
ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇపిస్తానని మరోసారి మోసానికి యత్నించాడు. నాగరాజు పేరును గూగుల్ లో సర్చ్ చేసి.. చీటర్ అని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం తాము మోసపోయామని తెలుసుకుంది. అనంతరం కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీకాకుళానికి చెందిన ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు