Home /News /crime /

FORMER POLICEMAN SON HAS BEEN ARRESTED FOR RECORDING A VIDEO OF A WOMAN TAKING A BATH IN THANJAVUR SSR

Shocking Incident: పెళ్లయింది.. ఒక పాప కూడా ఉంది.. భార్యాబిడ్డతో సంతోషంగా ఉండక ఇదేం గలీజు పని..

నిందితుడు నసీర్, పవర్ బ్యాంక్ పక్కనే వెబ్‌క్యామ్

నిందితుడు నసీర్, పవర్ బ్యాంక్ పక్కనే వెబ్‌క్యామ్

ఆ యువకుడు ఒక మాజీ పోలీసు కొడుకు. కానీ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. చివరికి ఓ నీచమైన పని చేసేందుకు కూడా దిగజారాడు. ఓ మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న వీడియోలను ఆమెకు తెలియకుండా బాత్రూమ్‌లో కెమెరా అమర్చి.. ఆమె స్నానం చేసి వెళ్లిపోగానే.. ఆ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూసి పైశాచిక ఆనందం పొందేవాడు.

ఇంకా చదవండి ...
    తంజావూర్: ఆ యువకుడు ఒక మాజీ పోలీసు కొడుకు. కానీ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. చివరికి ఓ నీచమైన పని చేసేందుకు కూడా దిగజారాడు. ఓ మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న వీడియోలను ఆమెకు తెలియకుండా బాత్రూమ్‌లో కెమెరా అమర్చి.. ఆమె స్నానం చేసి వెళ్లిపోగానే.. ఆ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. అయితే.. సదరు మహిళ ఒకరోజు బాత్రూమ్‌లో లేసర్ లైట్ వెలుగుతుండటాన్ని గమనించింది. భర్తకు సమాచారం అందించింది. కెమెరా అమర్చినట్లు తేలింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆ రహస్య కెమెరా అమర్చిన యువకుడికి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంజావూరుకు చెందిన మాజీ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కొడుకు నసీర్ అహ్మద్(35). అతనికి పెళ్లై ఆరేళ్ల వయసున్న పాప కూడా ఉంది. కానీ.. నసీర్‌లో పైశాచికత్వం మాత్రం తగ్గలేదు. నసీర్ ఇంటి పక్కనే ఓ వ్యక్తి కుటుంబం నివాసం ఉండేది. ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని గవర్నమెంట్‌ స్కూల్‌లో పనిచేసేవాడు. అతనికి భార్యా, కూతురు ఉన్నారు. అతని ఇంటికి సంబంధించిన బాత్రూమ్ ఇంటికి వెనుక వైపు ఉండేది. ఆ బాత్రూమ్ వెనుక ఓ ఖాళీ ఇల్లు ఉండేది. ఆ ఇంటి తాళపు చెవిని ఓనర్ నసీర్ అహ్మద్‌కు ఇచ్చాడు.

    ఎవరైనా ఇల్లు అద్దెకు కావాలని వస్తే చూపించమని చెప్పి.. కీస్ ఇస్తే.. రోజూ పనిగట్టుకుని మరీ ఆ ఇంటి మేడపైకి వెళ్లి.. ఆ వ్యక్తి భార్య, కూతురు స్నానం చేస్తుంటే చూసేందుకు నసీర్ ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే.. ఒకరోజు ఎవరూ చూడకుండా బాత్రూమ్ గ్లాస్ తొలగించి.. ఎవరికీ కనిపించకుండా పవర్ బ్యాంక్‌లో వెబ్ క్యామ్ అమర్చి ఆ మహిళలు స్నానం చేస్తుంటే చూసి నజీర్ పైశాచిక ఆనందం పొందేవాడు. అయితే.. ఇటీవల బాత్రూమ్ కిటికీ దగ్గర.. బయట పక్క లేజర్ లైట్ వెలుగుతుండటాన్ని ఇటీవల ఆ వ్యక్తి భార్య గమనించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అతను వచ్చి చూడగా.. పవర్‌బ్యాంక్‌కు ఓ వెబ్ క్యామ్ అమర్చి స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేస్తున్నట్లు తేలింది. సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

    ఇది కూడా చదవండి: So Sad: ఇక తన వల్ల కాదని ఇంటి వెనుక బావి చూసుకుని దూకేసింది.. ఈ అమ్మాయి ఉసురు వాళ్లకు తగలకపోదు..

    ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ కేసులో నిందితుడు నసీర్ అహ్మద్‌గా తేల్చారు. అతను ఓ మాజీ పోలీస్ అధికారి కొడుకని కూడా గుర్తించారు. నసీర్‌తో కొద్దిరోజుల క్రితమే బాధిత వ్యక్తికి గొడవైంది. అతని కూతురు స్నానం చేస్తుంటే.. టెర్రాస్‌పైకి ఎక్కి నసీర్ చూస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తి అతనితో గొడవపెట్టుకున్నాడు. అప్పటి నుంచి మరింత రెచ్చిపోయిన నసీర్.. వెబ్ క్యామ్‌ను ఎవరికీ కనిపించకుండా ఫిక్స్ చేసి.. రోజూ బాధిత కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుంటే చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. పోలీసులు నసీర్‌ను అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు