హోమ్ /వార్తలు /క్రైమ్ /

Former Home minister: మనీలాండరింగ్​ కేసులో ఈడీ కస్టడీకి మాజీ హోం మంత్రి.. ఈ నెల 12 వరకు విచారణ

Former Home minister: మనీలాండరింగ్​ కేసులో ఈడీ కస్టడీకి మాజీ హోం మంత్రి.. ఈ నెల 12 వరకు విచారణ

ముంబై హైకోర్టు

ముంబై హైకోర్టు

మనీ లాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి (Former Home minister), ఎన్‌సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh) అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రికి ముంబై హైకోర్టు (Mumbai highcourt) షాక్‌ ఇచ్చింది.

వేల కోట్ల  రూపాయల మనీ లాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి (Former Home minister), ఎన్‌సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh) అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రికి ముంబై హైకోర్టు (Mumbai high-count) షాక్‌ ఇచ్చింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడి (Enforcement Directorate custody)కీ ఈ నెల 12 వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. నవంబర్‌ 1న మనీలాండరింగ్‌ (Money laundering) కేసులో అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు. శనివారం పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు (Special court) అనిల్‌ దేశ్‌ముఖ్‌ కస్టడీని పొడగించడానికి నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడికి పంపించిన విషయం తెలిసిందే. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్.. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ (Former Home minister Anil Deshmukh)పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని హోటల్స్, బార్స్ నుంచి నెలకు రూ.100 కోట్ల రూపాయలను ప్రతి నెలా వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్.. అసిస్టెంట్ కమిషనర్‌గా డిస్మిస్ అయిన సచిన్ వాజెను అడిగారనేది పరమ్ భీర్ సింగ్ (Param birr singh) ప్రధాన అభియోగం.

మాజీ కమిషనర్ ఆరోపణలపై..

ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) పరమ్ భీర్ సింగ్‌ను ముంబై పోలీస్ కమిషనర్‌గా తొలగించింది. మాజీ కమిషనర్ ఆరోపణలపై విచారణ జరపాలని బాంబే హైకోర్టు సీబీఐ (CBI)కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన ఈడీ ముంబై పోలీస్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం హెడ్ సచిన్ వాజే.. ముంబైలోని orchestra bars నుంచి డిసెంబర్ 2020 మరియు ఫిబ్రవరి 2021 మధ్య రూ.4.70 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. ఆ డబ్బును తన అసిస్టెంట్ ద్వారా అనిల్ దేశ్‌ముఖ్‌కు చేరవేసినట్లు ఈడీ (ED) తెలిపింది. అంతేకాదు.. నాగ్‌పూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సాయి శిక్షణ్ సంస్థ అనే చారిటబుల్ ట్రస్ట్‌కు ఈ మధ్య కాలంలో రూ.4.18 కోట్ల విరాళాలు ఢిల్లీ (Delhi)లోని షెల్ కంపెనీల నుంచి వచ్చినట్లు ఈడీ గుర్తించింది.

మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇటీవలె అరెస్ట్ అయ్యారు. ముంబై కార్యాలయంలో 12 గంటల పైనే విచారించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. Money laundering అంశంలో అనిల్ దేశ్ ముఖ్ కు ఈడీ సమన్లు జారీచేసింది. దీనిపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు తన పిటిషన్ ను తిరస్కరించింది. అయితే ఇటీవల దేశముఖ్ ఆస్తులపై దాడి చేసి ఆస్తులను జప్తు చేసింది.

First published:

Tags: Bombay high court, Enforcement Directorate, Maharastra, Money Transfer, Mumbai

ఉత్తమ కథలు