Home /News /crime /

FORMER INDIAN CRICKETER YUVRAJ SINGH HAS BEEN ARRESTED BY HARYANA POLICE IN CONNECTION WITH A CASE PRV

Yuvraj singh arrest: భారత మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ అరెస్ట్.. హర్యానాలో ఓ కేసుకు సంబంధించి పోలీసుల చర్యలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. యువరాజ్​ను హర్యానా పోలీసులు అరెస్ట్​ చేయడం సంచలనం సృష్టించింది. కాగా, యువరాజ్​ అరెస్ట్​కు కులం విషయంలో అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది.

భారత మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్ ( Indian Ex cricketer Yuvraj singh) ​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. యువరాజ్​ను హర్యానా పోలీసులు అరెస్ట్​ (arrest) చేయడం సంచలనం సృష్టించింది. కాగా, యువరాజ్​ అరెస్ట్​కు అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. గతేడాది భారత క్రికెటర్​ రోహిత్ శర్మ‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్​ లైవ్‌ (Instagram live)లో మాట్లాడాడు. ఆ సందర్భంగా క్రికెటర్ చాహల్‌ (chahal)పై సరదాగా కామెంట్ చేశారు యూవీ. చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు (videos) పోస్ట్‌ చేస్తున్నాడని.. బాంగీ (Bhangi) మనుషుల్లా వీళ్లకు పని పాటా లేదా? అని వ్యాఖ్యానించారు. ఆ మాటలకు రోహిత్​  నవ్వి ఊరుకున్నారు. ఆ వీడియో (video) అప్పుడు సోషల్ మీడియా (social media)లో వైరల్ అయింది. దళితుల (dalit)ను కించపరిచేలా యువరాజ్ మాట్లాడాడని.. నెటిజన్లు (netizens) దుమ్మెత్తిపోశారు. యువరాజ్ సింగ్ (Yuvraj singh) క్షమాపణ (apology) చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యువరాజ్‌పై హర్యానా (Haryana)లో కేసు నమోదయింది.

హిందీలో బాంగీ అంటే దళిత (dalit) వర్గానికి చెందిన ఓ కులాన్ని (caste) పిలుస్తారు. వీధులు ఊడ్చే వారిని దిగువ స్థాయి కులాలకు చెందిన వారిని బాంగీ (bhangi)గా పిలుస్తారు. యువరాజ్ సింగ్ అలాంటి పదాన్ని వాడడంతో వారిని కించపరిచాడని అనే అపవాదు వచ్చింది.

దళిత హక్కుల నేత ఫిర్యాదు..

ఈ పరిణామంపై యువరాజ్ సింగ్ పై హరియాణా దళిత (dalit) హక్కుల నేత రజత్ కల్సన్ (rajath kalsan) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరియాణాలోని హిసార్‌ ప్రాంతంలో  పోలీసు కేసు నమోదు చేశారు. కాగా, అప్పట్లో ఈ కేసులో రోహిత్ శర్మని కూడా టార్గెట్ చేశారు. దీని గురించి ఆ సమయంలో రజత్ కల్సన్ మాట్లాడుతూ.. ’యువరాజ్ వ్యాఖ్యలను రోహిత్ (rohit) ఎందుకు ఖండించలేదు. యువరాజ్ సింగ్ ‘భాంగీ’ అన్నప్పుడు రోహిత్ నవ్వి ఎలా ఊరుకుంటాడు. యువరాజ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇందుకు సంబంధించిన సీడీలు, పత్రాలు పోలీసులకు అందజేశాం.’ అని అన్నారు.

గతేడాదే క్షమాపణ..

దీనిపై అప్పట్లోనే ఎస్పీ (SP) లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ’విచారణకు సంబంధించిన వివరాలను ఇప్పటికే డీజీపీ (DGP)కి అందించాం. యువరాజ్ తప్పు చేసినట్ల నిర్ధారణ జరిగితే.. అతనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. దీంతో ఇపుడు యువరాజ్​ సింగ్​ను పోలీసులు అరెస్ట్ (police arrested)​ చేశారు. దీంతో యువరాజ్​ సింగ్​ తరఫు లాయర్​ బెయిల్​ అప్లై చేయడం.. బెయిల్​ రావడం చకచకా జరిగిపోయాయి.  యువరాజ్​ సింగ్​ బెయిల్ (Bail)​పై విడుదల అయినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై గతేడాది జూన్​లోనే యువరాజ్​ సింగ్​ క్షమాపణలు చెప్పాడు.





‘‘కులం, రంగు, మతం, లింగం వంటి వ్యత్యాస్యాలను నేను పట్టించుకోనని, విశ్వసించనని మీ అందరికి స్పష్టంగా తెలియజేస్తున్నా. నేను ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తాను. ప్రతీ ఒక్కరికి గౌరవం ఇవ్వాలని, ఒకరికొకరం మర్యాదగా నడుచుకోవాలని భావిస్తా. నా సహచరులతో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. ఏది ఏమైనా బాధ్యాతాయుతమైన భారతీయుడిగా నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే వారందరికి క్షమాపణలు తెలియజేస్తున్నా. నా వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా. దేశం, ప్రజల పట్ల నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు ” అని యువరాజ్​ అప్పట్లోనే ట్వి టర్​లో పోస్టు పెట్టారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Arrested, Crime news, Haryana, Haryana police, Yuvaraj singh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు