హోమ్ /వార్తలు /క్రైమ్ /

Vinod Kambli : ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్న మాజీ క్రికెటర్.. పోలీస్ ఎంట్రీతో సీన్ రివర్స్

Vinod Kambli : ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్న మాజీ క్రికెటర్.. పోలీస్ ఎంట్రీతో సీన్ రివర్స్

భార్య ఆండ్రియాతో వినోద్ కాంబ్లి (పాత ఫొటో)

భార్య ఆండ్రియాతో వినోద్ కాంబ్లి (పాత ఫొటో)

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తూ సొంతూరు ముంబైలోనే నివసిస్తున్నారు. ఈనెల 3న కాంబ్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. కేవైసీ వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని, లేకుంటే క్రెడిట్, డెబిట్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన కాంబ్లి.. కేవైసీ అప్డేషన్ కోసం తన మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేశాడు. అంతే..

ఇంకా చదవండి ...

వినోద్ కాంబ్లి.. టన్నులకొద్దీ ట్యాలెంట్ ఉన్నా నిలకడలేని ప్రవర్తనతో టీమిండియాకు దూరమైనప్పటికీ ఆటకు, ఆటలకు అవతలి విషయాల్లోనూ నిత్యం వార్తల్లో నిలుస్తారు ఈ మాజీ క్రికెటర్. తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్నారాయన. తద్వారా సైబర్ నేరాలపై పెద్దగా అవగాహన లేని సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు సైతం మోసాలకు గురవుతున్నట్లు మరోసారి వెల్లడైంది. అయితే, ముంబై పోలీసులు హుటాహుటిన చేపట్టిన చర్యలతో కాంబ్లి పోగొట్టుకున్న సొమ్ము అణాపైసతోసహా తిరిగి ఆయన అకౌంట్లోనే జమ అయింది. బంద్రా పోలీస్ స్టేషన్ సైబర్ నేరాల విభాగం అధికారులు చెప్పిన వివరాలివి..

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తూ సొంతూరు ముంబైలోనే నివసిస్తున్నారు. ఈనెల 3న కాంబ్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. కేవైసీ వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని, లేకుంటే క్రెడిట్, డెబిట్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన కాంబ్లి.. కేవైసీ అప్డేషన్ కోసం తన మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేశాడు. అంతే..

Omicron : మూడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్ -దేశంలో తొలిసారి పిల్లలకూ వ్యాప్తి -పరిస్థితి ఎలా ఉదంటే..వినోద్ కాంబ్లి బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ.1.14లక్షలు మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అప్పుడుగానీ తాను మోసపోయినట్లు గుర్తించలేదాయన. ఎనీ డెస్క్ యాప్ ద్వారా అవతలి వ్యక్తి సిస్టమ్ ను పూర్తిగా అదుపులోకి తీసుకోవచ్చని తెలిసిందే. అలా కాంబ్లి అకౌంట్ ను కబ్జా చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేశారు. ఈ విషమై కాంబ్లి వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరాల విభాగం అప్రమత్తమై..

actress lahari: టీవీ సీరియల్ నటి లహరి అరెస్ట్.. తీవ్రగాయాలు.. మద్యం మత్తులోనే అలా చేసిందా?

కాంబ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సత్వరమే బ్యాంక్ అధికారులను సంప్రదించారు. కాంబ్లి అకౌంట్ నుంచి ఏ అకౌంట్ లోకి డబ్బులు బదిలీ అయ్యాయో గుర్తించి, రివర్స్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆ డబ్బును తిరిగి కాంబ్లి అకౌంట్ లోనే జమ చేశారు. పోయిందనుకున్న డబ్బు తిరిగిరావడంతో కాంబ్లీ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభించే అవశాలుంటాయని పోలీసులు చెబుతున్నారు.

First published:

Tags: CYBER CRIME, CYBER FRAUD, Mumbai, Mumbai Police

ఉత్తమ కథలు