Home /News /crime /

FORMER BJP MLA ALLEGEDLY SEXUALLY ASSAULTED GIRL STUDENT IN UTTAR PRADESH SU

మాజీ ఎమ్మెల్యే‌పై విద్యార్థిని సంచలన ఆరోపణలు.. లైంగికంగా వేధించాడని ఫిర్యాదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. దీంతో బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ది చేశారు.

    భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. దీంతో బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ది చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉతర్తప్రదేశ్‌లో చోటుచేసకుంది. వివరాలు.. భగతువా ప్రాంతంలో ఎంపీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ కాలేజ్‌కు మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్ పాథక్ చైర్మన్‌గా ఉన్నారు. అయితే పాథక్ తన కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు వచ్చి దాడి చేశారు. దాదాపు పది మంది ఒకేసారి దూసుకువచ్చి చితకబాదారు. విద్యార్థిని బంధువులతో పాటు స్థానికులు కూడా పాథక పాథక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ దాడి అనంతరం పాథక్.. విద్యార్థిని కి క్షమాపణ చెప్పారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాథక్ తనను లైంగికంగా వేధించాడని విద్యార్థిని పోలీసులకు తెలిపింది.

    పాథక్‌పై విద్యార్థిని దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందారు. మరోవైపు ఈ ఘటన తన ఇమేజ్‌ను కించపరచడానికి చేసిన రాజకీయ కుట్ర అని పాథక్ ఆరోపించారు. "వారం రోజుల కిందట బాలిక రిపబ్లిక్ డే స్పీచ్‌కు ప్రిపేరింగ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆమె స్పీచ్ సరిగా చదవకపోవడంతో నేను ఆమెను తిట్టాను. అనంతరం అక్కడ నుంచి పంపించాను. ఒక విద్యార్థినిని తిట్టడం నేరం అయితే.. నేను దీనికి క్షమాపణలు చెబుతున్నాను. వారు నాతో మాట్లాడుతున్న సమయంలో వీడియో తీస్తున్నట్టు నేను గుర్తించలేదు" అని పాథక్ తెలిపారు. ఇక, పాథక్ చిరాగావ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని బౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఎస్కే శుక్లా మీడియాకు తెలిపారు. అయితే వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Molestation, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు