హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: స్కూల్ లో అమానుషం.. క్లాస్ లో బాలికల దుస్తులు విప్పించి.. అందరి ముందే మూత్ర విసర్జన.. ఆ తర్వాత..

Shocking: స్కూల్ లో అమానుషం.. క్లాస్ లో బాలికల దుస్తులు విప్పించి.. అందరి ముందే మూత్ర విసర్జన.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: ఢిల్లీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. క్లాస్ రూమ్ డోర్ వేసి విద్యార్థుల ఎదుట వికృతంగా ప్రవర్తించాడు.

ప్రస్తుతం దేశంలో ప్రతి రోజు వేధింపులకు ఘటనలు వార్తలో ఉంటున్నారు. కొంత మంది దుర్మార్గులు అత్యంత దారుణాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం దిశ, నిర్భయ వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మాత్రం మార్పులు రావడంలేదు. గుడి, బడి, బస్టాండ్, ఆఫీస్ ఇలా ప్రతి చోట మహిళలు (Harassment On woman) వేధింపులకు గురౌతున్నారు. ఇక కామాంధులు.. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు.

కొన్ని చోట్ల కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నే.. తమ వారిపై అఘాయిత్యాలకు (Rape on woman) పాల్పడుతున్నారు. ఢిల్లీలో ఒక పాఠశాలలో విద్యార్థులపై జరిగిన వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో తమ నిరసలు తెలియజేస్తున్నారు.

పూర్తి వివరాలు.. ఢిల్లీలోని (Delhi)  మున్సిపల్ పాఠశాలలో ఏప్రిల్ 30 న ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని ఆగంతకుడు (students assulted) స్కూల్ లో ప్రవేశించాడు. ఆ తర్వాత.. అక్కడ ఒక తరగతిలో ప్రవేశించాడు. డోర్ ను లాక్ చేశాడు. ఇద్దరు విద్యార్థినుల దుస్తులు (Removing cloths) తొలగించాడు. ఆ తర్వాత.. వారిముందే మూత్ర విసర్జన (pass urine) చేస్తు పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. కాసేపటికి ఆగంతకుడు పారిపోయాడు. ఘటనపై తీవ్ర దుమారం చేలరేగింది. దీనిపై విద్యార్థులు యజమాన్యానికి ఫిర్యాదు చేయగా పట్టించుకొలేదు. ఇది కాస్త ఢిల్లీ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. దీనిపై మహిళా కమిషన్ (Womans commission)  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్వాతి మలివాల్ (Swathi maliwal) పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యూపీలో పోలీసు అధికారి అత్యాచార బాధితురాలని స్టేషన్ లోనే రేప్ చేశాడు.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) అమానుషం చోటు చేసుకుంది. లలిత్ పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత నెల ఏప్రిల్ 22 న 13 ఏళ్ల బాలికను కొందరు ప్రలోభ పెట్టి భోపాల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఒక గదిలో బంధించారు. నలుగురు కలసి నాలుగు రోజుల పాటు  (Rape on girl) అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆమె ఇంటి దగ్గర వదిలేసి నిందితులు పారిపోయారు. అప్పటికే తమ కూతురి ఆచూకీ కోసం వారు వెతుకుతున్నారు.

బాధితురాలు జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు పోలీసు స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే, స్టేషన్ అధికారి తిలకధారి ఆమెపై కన్నేశాడు. రెండోరోజు ఆమెను స్టేట్ మెంట్ రికార్డు చేయాలని స్టేషన్ కు రప్పించాడు. ఆమె అత్త ముందే.. ఆమెను సెల్ లోనికి తీసుకెళ్లి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు షాకింగ్ కు గురయ్యింది. ఆ తర్వాత... వారు ఉన్నతాధికారులకు వెళ్లి జరిగిన దారుణాన్ని తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే స్టేషన్ హౌస్ అధికారిని తిలక్ ధారిని సస్పెండ్ చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి అధికారులు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Delhi, Harassment, Harassment on women, Minor girl

ఉత్తమ కథలు