రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో హల్చల్ చేసిన చిరుత.. ప్రస్తుతం మెర్లపాలెం, వాడపల్లి పరిసరాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అంకంపాలెం నుంచి మాయమైన చిరుత అక్కడి పరిసరాల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు సైతం ధ్రువీకరించారు. అడుగుల ముద్రల ఆధారంగా చిరుత సంచారాన్ని వారు నిర్దారించారు.
చిరుత ఇదే ప్రాంతంలో ఉన్నట్టు తేలడంతో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంకంపాలెంలో తప్పించుకున్న చిరుతను ఈసారి ఎలాగైనా బంధించాలని చూస్తున్నారు.అయితే చిరుత సంచారం గురించి తెలిసిన పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ఇదే చిరుత అంకంపాలెంలో కొంతమంది స్థానికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న ఓ కొబ్బరి చెట్టుపై ఎక్కి.. చాలాసేపు అక్కడే ఉండిపోవడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
ఇది కూడా చదవండి : పంజా విసిరి...గోళ్లతో రక్కేసింది...తూర్పుగోదావరిలో చిరుత బీభత్సం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tiger Attack