కేరళలో ఏనుగు అరెస్ట్... ఏం నేరం చేసిందో తెలుసా...

Malappuram : మనుషుల్ని అరెస్ట్ చెయ్యడం కామన్. ఏనుగును అరెస్టు చెయ్యడమేంటని మీకు అనిపిస్తోందా... మీరు కరెక్టుగానే ఆలోచిస్తున్నారు. కారణమేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 9:50 AM IST
కేరళలో ఏనుగు అరెస్ట్... ఏం నేరం చేసిందో తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 9:50 AM IST
కేరళ... మలప్పురం సిటీకి కాస్త దూరంలో అడవి ఉంటుంది. సిటీలోని ఓ ఏనుగు... దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయింది. దాని పేరు కుదుర్ స్వామినాథన్. అడవిలోకి వెళ్లేందుకు దానికి అనుమతి లేదట. విషయం తెలుసుకున్న వనియంబర్ డిప్యూటీ రేంజర్ సెబాస్టియన్, ఆయన టీమ్ ఆఘమేఘాలపై వెళ్లి... ఏనుగు ఎక్కడుందో కనిపెట్టి అరెస్టు చేసి ఊపిరి పీల్చుకున్నారు. కేరళ అటవీ శాఖ చరిత్రలో ఓ ఏనుగును అరెస్టు చెయ్యడం ఇదే తొలిసారి. ఆ ఎలిఫాంట్... పెరింతల్మన్నలోని... పాంపట్టిలో ఉన్న టీక్ ఎస్టేట్‌లోకి వెళ్లిందనీ... అలా వెళ్లేందుకు దానికి పర్మిషన్ లేకపోవడం వల్ల, దాని దగ్గర అనుమతి సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల అరెస్టు చేశామని గొప్పగా చెబుతున్నారు పోలీసులు.

టీక్ గార్డెన్‌లో కొన్ని మొక్కలు, చెట్లను ఏనుగు కుదుర్ స్వామినాథన్ నాశనం చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు... సుమేష్, మోహన్ రాజ్, కవిషేరీ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. వాళ్లే దాన్ని సిటీలో ప్రజలకు అద్దెకు ఇస్తున్నారు. ఏనుగు తమది కాదనీ... బాబు, అనేష్ అనే ఇద్దరిదని వాళ్లు చెబుతున్నారు. ఐతే... ఆ ఏనుగు ఆ ఇద్దరిదే అనేందుకు ఎలాంటి ఓనర్‌షిప్ రికార్డులూ లేవు. అలాగే ఏనుగుకి సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్లు కూడా లేవు. ఆ ఇద్దరూ ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. కాబట్టి... ఆ ఏనుగును కేరళ ప్రభుత్వానికి అప్పగించే అవకాశాలున్నాయి. త్వరలోనే బాబు, అనేష్‌ను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...