Forest Fire Flares Up As Temperature Soars Reaches Boys Hostel: దేశంలో క్రమంగా కొద్ది రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో భానుడి వేడికి అడవుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. తాజాగా, ఉత్తరాఖండ్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో మంగళవారం అడవుల్లో మంటలు చెలరేగాయి. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు అడవికి దగ్గరలో ఉంటాయి. ఈ క్రమంలో... మెడికల్ కాలేజ్ బాలుర హాస్టల్ వరకు ఈ మంటలు వ్యాపించాయి.
ప్రస్తుతం.. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లోని వీర్ చంద్ర సింగ్ గర్వాలీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లోని బాలుర హాస్టల్లోకి మంటలు వ్యాపించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం, గర్హ్వాల్ ప్రాంతంలో ఇప్పటి వరకు 117 తాజా అటవీ అగ్ని సంఘటనలు నమోదయ్యాయి. వాటిలో 32, కుమావోన్ ప్రాంతం 75 మరియు వన్యప్రాణుల ప్రాంతాలు 10 ఉన్నాయి.
#WATCH | Forest fire reaches boys hostel of Veer Chandra Singh Garhwali Government Institute Of Medical Science and Research in Srinagar, Uttarakhand pic.twitter.com/cHdXcFXeKk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 19, 2022
ఈ మంటల్లో 198.9 హెక్టార్ల అటవీ భూమి ధ్వంసమై రూ.5.28 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లో సోమవారం 27 అటవీ అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రారంభమైన అగ్నిమాపక సీజన్లో 1020.29 హెక్టార్ల అటవీ భూమి ప్రభావితమైందని తెలిపారు.
ఇందులో 724.93 హెక్టార్ల రిజర్వు అటవీ ప్రాంతం కూడా ఉందని అటవీ, అటవీ అగ్ని మరియు విపత్తు నిర్వహణ చీఫ్ కన్జర్వేటర్, నిశాంత్ వర్మ తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఏడాది అడవుల్లో మంటలు చెలరేగడంతో ఎలాంటి మానవ ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. స్థానిక ప్రజలను ప్రమేయం చేయడం ద్వారా పరిస్థితిని నియంత్రించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను కోరారు.
యూపీలో అగ్నిప్రమాదం జరిగింది.
Fire Breaks Out In Ghaziabads Indirapuram: ఉత్తర ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్ లోని ఇందిరాపురం ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వ్యాపించాయి. అక్కడి ప్రదేశం అంతా.. దుమ్ము, ధూళి, పొగతో నిండిపోయింది. వెంటనే స్థానికుల అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఆరు ఫైరింజన్ లతో ఎగిసిపడుతున్న మంటలున అధికారులు అదుపులోనికి తెవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఆయా ప్రాంతాలలో అంబులెన్స్ లను మోహరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆ ప్రాంతంలో పొడి జంక్ , ఆకులను ఉంచిన గ్రీన్ బెల్ట్‌లో నిర్మించిన ఆ తర్వాత మూసివేసిన ఫామ్‌హౌస్‌లలో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Uttarakhand