Vijayawada: విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల చోరీ కేసులో కీలక పరిణామం

వెండి రథానికి చెందిన సింహాల ప్రతిమలను ఎవరు చోరీ చేశారనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ రథాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది.

news18-telugu
Updated: September 28, 2020, 8:40 PM IST
Vijayawada: విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల చోరీ కేసులో కీలక పరిణామం
రథంపై వెండి సింహం విగ్రహాల మాయం
  • Share this:
ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెండి రథానికి చెందిన సింహాల ప్రతిమలను ఎవరు చోరీ చేశారనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ రథాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. వెండి రథంపై ఉన్న వేలిముద్రలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. ఇందుకోసం స్వయంగా వేలి ఫోరెన్సిక్ డైరెక్టర్ ఆర్.కె.శారీన్ రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న కేసులు కావడంతో డైరెక్టర్ నేరుగా వచ్చి వెండి రథాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి పలు వివరాలను సేకరించారు. వెండి రథంపై సింహాల ప్రతిమలు ఉన్న చోట వెలిముద్రలు కీలకంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఫోరెన్సిక బృందం నివేదిక ఇవ్వనుంది.

ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కూడా సీరియస్‌గా దృష్టి పెట్టారు. అసలు ఈ రథానికి సంబంధించిన సింహాల ప్రతిమల చోరీ ఎప్పుడు జరిగిందనే దానిపై పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనే చోరీ జరిగినట్లు గుర్తించారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా రథాన్ని సిద్ధం చేయాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్‌లో మార్చి 25న వెండిరథం ఊరేగింపు ప్రస్తావన ఉంది. ఊరేగింపు సందర్భంగా రథం మరమ్మతులు, పాలిష్ చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ అయ్యాయి.

పాలిష్ చేసిన సమయంలో.. సింహపు ప్రతిమలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇంజినీరింగ్ విభాగం, స్తపతి, పాలిష్ పెట్టేవారు, అప్రైజర్స్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అంతకుముందు గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అధికారులు ప్రస్తావించారు. 2019 ఏప్రిల్ 6 నుంచి ఈ నెల 15లోపు చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.చోరీకి గురైన మూడు ప్రతిమలు విలువ రూ.20 లక్షలు ఉంటాయని అధికారులు అంటున్నారు. వెండి రథాన్ని 2002లో తయారు చేయించగా.. కనిపించకుండా పోయిన సింహపు ప్రతిమ 3 కిలోల 365 గ్రాముల వెండితో చేశారు.

ఫోరెన్సిక బృందం నివేదిక ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉందని.. నిందితులను గుర్తించేందుకు అది తమకు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సాధ్యమైనంత తొందరగా ఈ కేసు విచారణను పూర్తి చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్వేది రథం దహనం కేసును సీబీఐకు అప్పగించిన ఏపీ ప్రభుత్వం.. ఈ కేసును త్వరగా చేధించాలని భావిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2020, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading