అది హరియాణాలోని ముర్తాల్ ప్రాంతం. ఐదారు వాహనాలు ఢిల్లీ వైపుగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకుని ఆ వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. అందులోని సరుకును చూసి పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఉన్న సరుకు మరేంటో కాదు. విదేశీ మద్యం బాటిళ్లు. ఒక్కటీ రెండు కాదండోయ్.. అక్షరాల 62,400 బాటిళ్లు. దాని విలువ సుమారు రూ.3కోట్ల పైమాటే. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని ముర్తాల్ ప్రాంతం నుంచి విదేశీ మద్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణ చేస్తున్నారంటూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందానికి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముర్తాల్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే సమీపంలోని ఓ ధాబా వద్ద ఉన్న వాహనాలను తనిఖీ చేశారు. అక్కడి వాహనాల్లో భారీగా విదేశీ మద్యం వెలుగుచూసింది.
ఆ వాహనాల్లో 5200 బాక్సుల్లో 62,400 మద్యం బాటిళ్లను పంజాబ్‌లోని డేరాబాసి ప్రాంతం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఆ పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అధికారికంగా ధ్రువీకరించారు. ఇదేవిధంగా ఏప్రిల్ 18న రెండు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న 12వేల విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.