మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలపై అత్యాచార ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటునే ఉన్నాయి. పసిపాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు వేధింపులకు గురౌతున్నారు. ఇక .. వీటిని అరికట్టాల్సిన పోలీసుల్లో కూడా కొంత మంది నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాము ఏంతక్కువన అన్నట్లు.. మహిళలను స్టేషన్ లోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమ అధికారాలను, హోదాలను అడ్డంపెట్టుకుని మహిళలను, బాధితుల బలహీనతలను అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారు. అయితే.. జైలులోని మహిళా వార్డులు వేధింపులు ఎదుర్కొన్న ఘటన వార్తలలో తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాలు.. జెరూసలేంలో (Israeli Guard) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గిల్బోవా జైలులో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. ఒక పాలస్తీనా ఖైదీ తనపై బలవంతంగా అత్యాచారం చేసేవాడని మహిళ గార్డు ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జైలులో (Prison) కొన్ని వార్డులలో ఖైదీలు, పురుష అధికారులకు దాడులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో అక్కడ మహిళ గార్డులను నియమించారు. ఆ తర్వాత.. కొందరు ఖైదీలు.. మహిళ గార్డును బెదిరిస్తు.. లైంగిక చర్య కోసం బానిసగా (mating Slave) మార్చేశారని ఆమె తన బాధను చెప్పుకుంది. జైలు నుంచి బయటకు రాకుండా తమను అధికారులు చేశారని తెలిపింది.
అయితే.. కొందరు జైలులోని సొరంగం మార్గం గుండా తప్పించుకున్నారు. అప్పుడు కొందరు మహిళ గార్డులు కూడా బయటకు వచ్చారు. ఆ తర్వాత.. జైలులో ఎదుర్కొన్న భయంకర అనుభవాలను అధికారులకు చెప్పడంతో, ఘటన బయటపడింది. దీనిపై మహిళ గార్డు.. తమను బలవంతంగా లైంగిక చర్య కోసం బానిస చేశారని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా బలవంతంగా తమను (Female harassment) అనుభవించేవారని తెలిపింది. ఈ పరిణామాలు.. కాస్త ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి వరకు వెళ్లింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (viral news) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Female harassment, Israel, Police