Home /News /crime /

FORCED MARRIAGES WITH UNMARRIED GIRLS SEXUAL ASSAULTS IN AFGHANISTAN VB

Talibans In Afghanistan: పెళ్లికాని యువతులతో బలవంతపు పెళ్లిళ్లు.. లైంగిక దాడులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Talibans: తాలిబన్ల అరాచకాలు అఫ్గానిస్థాన్‌లో తారాస్థాయికి చేరాయి. సైనికులు, పౌరులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. మహిళలను బలవంతగా పెళ్లిళ్లు చేసుకొని.. లైంగికంగా హింసిస్తున్నారు. దీనిపై మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  తాలిబన్ల అరాచకాలకు అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారి దురాక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాలిబన్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా అఫ్గానిస్థాన్‌లో అతి పెద్ద నగరమైన కాందహార్ సహా లోగర్‌, ఘాజ్నీ, హెరత్‌, హెల్మండ్‌ వంటి కీలక నగరాలను హస్తగతం చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తమను వివాహం చేసుకోవాలని.. అక్కడి మహిళలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. పెళ్లి కాని యువతులను అయితే బలవంతంగా పెళ్లి చేసుకొని.. లైంగికంగా హింసిస్తున్నారు. ఈ విషయంపై మానవహక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా అక్కడ తాలిబన్లకు పట్టుబడిన సైనికులు, పౌరులపై కూడా విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. తాము మిమ్మల్ని ఏం చేయమని.. తమ గురించి ఎలాంటి భయాలు.. ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెబుతూనే... మరో వైపు
  దారుణమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

  ఇప్పటికే అఫ్గానిస్థాన్‌లో వివిధ ప్రాంతాలను స్వాధీనం చేసుకోగా.. మరొక వారం రోజుల్లోగా కాబూల్‌ సహా దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని తాలిబన్లు బహిరంగంగానే ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ఈ తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సైనికులు వెళ్లిపోయిన దగ్గర నుంచి దూకుడు పెంచారు. అప్పటి నుంచి అక్కడ భయాందోళనలను కలిగిస్తున్నారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో ఇప్పటివరకు మొత్తం 12 ప్రావిన్షియల్‌ రాజధానులను ఆక్రమించుకున్నారు. అంటే అఫ్గానిస్థాన్‌ దేశ వ్యాప్తంగా మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ప్రాంతాలు వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయారు. దక్షిణ అఫ్గానిస్థాన్‌ అంతా ఇప్పడు తాలిబన్ల చేతిలోనే ఉంది.

  Read Also: ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్.. రెండోదశ ట్రయల్స్ కు అనుమతిచ్చిన కేంద్రం.. వివరాలివే..

  మరోవైపు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను అన్ని దేశాలను వెనక్కి రప్పిస్తున్నాయి. ఆఫ్ఘాన్‌లో ఉన్న భారతీయులంతా వీలైనంత త్వరగా తిరిగి వెనక్కి రావాలని భారత్ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు అడ్వైజరీ జారీచేసింది. తాజాగా నాలుగో అడ్వైజరీని కూడా జారీచేసింది. ఆప్ఘానిస్తాన్‌లో ఇప్పటికీ 1,500 మంది భారతీయుులు ఉన్నారని సమాచారం. వారిని వెనక్కి రప్పించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఆప్ఘానిస్తాన్‌‌లో హింస నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రముఖ నగరాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోకముందే అందరూ స్వదేశాలు చేరుకోవాలని భారత్‌తో పాటు యూకే, అమెరికా, జర్మనీ తమ పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంత జరుగుతున్నా అమెరికా మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. ఈ నెలాఖరు నాటికి అమెరికా బలగాలను పూర్తి స్థాయిలో ఉపసంహరించుకుంటామని.. సేనలన్నీ తిరిగి అమెరికా చేరుకుంటాయని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Afghanistan, Crime, Crime news, Taliban

  తదుపరి వార్తలు