• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • FOR THE FIRST TIME IN HYDERABAD MAN WHO STOLE CC CAMERA CAUGHT BY ANOTHER CC CAMERA NK

సీసీ కెమెరాను కొట్టేసి... మరో సీసీ కెమెరాకు దొరికిన దొంగ...

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Crime News : దొంగల్లో రకరకాలు. ఎంత ప్రత్యేకమైనా... సీసీ కెమెరాల్ని చూస్తే మాత్రం దొంగలు భయపడతారు. అలాంటిది ఆ దొంగ మాత్రం సీసీ కెమెరానే కొట్టేశాడు.

  • Share this:
దొంగల్ని కనిపెట్టేందుకే సీసీ కెమెరాలున్నాయి. అలాంటివి ఆ సీసీ కెమెరానే కొట్టేస్తే... ఇక పట్టుకునేదెలా. కష్టమే. కానీ ఆ దొంగకు చెక్ పెట్టగలిగారు హైదరాబాద్ పోలీసులు. వనపర్తికి చెందిన 40 ఏళ్ల శాంత నాయక్... హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో నివసిస్తున్నాడు. ఏదో ఒక పని చెయ్యకపోతే రోజు గడవదని తెలిసి... ఆటో నడుపుతున్నాడు. అదే పని చేసుకుంటూ బతికితే, ఏ సమస్యా ఉండేది కాదు. కానీ శాంత నాయక్‌కి అడ్డమైన అలవాట్లు ఉన్నాయి. బాగా తాగేవాడు, పేకాట ఆడతాడు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్తుంటాడు, పాడుపనులన్నీ చేసేవాడు. ఆటో నడుపుతూ వచ్చే డబ్బు సరిపోయేది కాదు. అందుకే మరింత డబ్బు కావాలని, దాన్ని షార్ట్ కట్‌లో సంపాదించాలని అనుకున్నాడు. అందుకోసం ఎంచుకున్న మార్గమే చోరీ.

ఆటోలో వెళ్తుంటే... ఓ చోట రోడ్డుపై తగిలించివున్న సీసీ కెమెరా కనిపించింది. అసలే చేతిలో డబ్బులు లేక ఎలాగా అని ఆలోచిస్తున్న శాంతా నాయక్‌కి ఆ సీసీ కెమెరాని కొట్టేస్తే ఏలా ఉంటుంది అనే దురాలోచన వచ్చింది. తన ఫేస్ కనిపించకుండా టవల్‌తో చుట్టుకొని... చుట్టూ ఎవరూ లేనివేళ చూసుకొని... ఆటో పైకి ఎక్కి... సీసీ కెమెరా తీగల్ని కట్ చేసి... చక్కగా కొట్టేసి, సైలెంట్‌గా చెక్కేశాడు. ఆలస్యం చెయ్యకుండా ఓ పాత ఇనుప సామాన్లు కొనే షాపులో అమ్మేశాడు.

అసలే శ్రీలంకలో ఉగ్రవాద దాడులు జరిగాయి. హైదరాబాద్‌లో అలర్ట్ ఉంది. ఈ టైంలో సీసీ కెమెరా నుంచీ సిగ్నల్స్ రాకపోయే సరికి, పోలీసులు వెళ్లి చూశారు. ఎవరో దాన్ని కొట్టేసినట్లు అర్థమైంది. వెంటనే దగ్గర్లోనే ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజ్‌ చూశారు. శాంత నాయక్ చేసిన ఘనకార్యం మొత్తం అందులో రికార్డైంది. అతను ఎవరో తెలియలేదు గానీ... అతని ఆటో నంబర్‌ తెలిసింది. దాని ఆధారంగా శాంత నాయక్‌ని పట్టుకున్నారు. ఇలా ఓ సీసీ కెమెరా దొంగిలిస్తూ... మరో సీసీ కెమెరాకు దొంగ చిక్కడం హైదరాబాద్‌లో ఇదే తొలిసారి అంటున్నారు పోలీసులు.

 

ఇవి కూడా చదవండి :

తమిళనాడులో వింత దూడ... మనిషిలా ప్రవర్తిస్తూ... ఆందర్నీ ఆశ్చర్యపరుస్తూ...

Cyclone Fani : ఒడిశాపై విరుచుకుపడిన ఫొణి తుఫాను... 50,000 గ్రామాలు... 50 నగరాలకు ముప్పు...

ఆ యువతిని చంపకుండా వదిలేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి... ప్రేమించడమే కారణమా...

చంద్రబాబు దృష్టి ఫలితాలపై... 4 నుంచీ ఓట్ల లెక్కింపు... సీట్ల సంఖ్య తేలుతుందా...
First published: