భార్యను చంపి... ఫుడ్ డెలివరీకి వెళ్లాడు... బెంగళూరులో దారుణం...

చిన్న తప్పు చేస్తేనే మన మనసు తట్టుకోలేదు. ఏదో పొరపాటు చేసిన ఫీలింగ్ మనసులో అలాగే ఉండిపోతుంది. అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అలాంటిది... అతను ఏకంగా భార్యను చంపి కూడా కూల్‌గా ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 12:09 PM IST
భార్యను చంపి... ఫుడ్ డెలివరీకి వెళ్లాడు... బెంగళూరులో దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో ప్రతి ఒక్కరికీ తెల్లారి లేవక ముందు నుంచే ఎన్నో పనులు. రాత్రి పడుకునే వరకూ అవి పూర్తవ్వని పరిస్థితి. అందువల్ల చాలా మంది మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఒత్తిడి వల్ల చిత్తై... లేనిపోని కోపాలకు పోయి... జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మరి ఈ కథలో ఏం జరిగిందంటే... కల్లేష్ (31) ఏడాది కిందట... శిల్ప (21)ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ... కర్ణాటకలోని... దుర్గాపరమేశ్వరీ లేఅవుట్‌లో కాపురం పెట్టారు. కొన్ని నెలల తర్వాత వాళ్లు బళ్లారి జిల్లాలోని సండూర్‌కి మకాం మార్చారు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కల్లేష్‌కి వచ్చేది అంతంత మాత్రం శాలరీయే. అది ఫ్యామిలీ గడిచేందుకు సరిపోయేది కాదు. అందువల్ల శిల్ప... తాను కూడా జాబ్ చేస్తానంటూ... దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌లో హెల్పర్‌గా చేరింది. ఇది కల్లేష్‌కి నచ్చలేదు. దీనిపై వాళ్లిద్దరూ తరచూ గొడవ పడసాగారు. రాన్రానూ గొడవలు ఎక్కువవుతుంటే... భరించలేకపోయిన శిల్ప... అలిగి... తన పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య వెళ్లిపోయాక... ఒంటరితనం తట్టుకోలేకపోయిన కల్లేష్... ఆమె పుట్టింటికి వెళ్లి... బతిమలాడుకున్నాడు. క్షమాపణ చెప్పాడు. దాంతో... కరిగిపోయిన ఆమె... అతనితో సండూర్‌ వచ్చింది. ఇక అప్పటి నుంచీ ఆమెపై పగతో రగిలిపోయాడు. సమస్యేంటంటే... శిల్పకు... ఆ రెస్టారెంట్‌లో ఎవరితోనో పరిచయం ఉందనీ, ఏదో మేటర్ నడుస్తోందనీ అతను భావించాడు. అందుకే ఎన్నిసార్లు అడిగినా... ఆమె ఆ ఉద్యోగం మానేయట్లేదని భ్రమించాడు. అలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలతో ఆమెపై ధ్వేషాన్ని పెంచుకున్నాడు.

ఆగస్ట్ 12న ఇద్దరి మధ్యా మళ్లీ గొడవ జరిగింది. అది డబ్బులకు సంబంధించిన వ్యవహారం. ఉద్యోగం మానేస్తే... సంసారం ఎలా గడుస్తుంది. మీరు తెచ్చే రూ.12 వేలతో తినేదెలా... అద్దెలు కట్టేదెలా... అని ప్రశ్నించింది. అర్థం చేసుకోకుండా ఎందుకలా అరుస్తున్నా్రు అంది. అంతే... ఏంటే... ఎన్నిసార్లు చెప్పినా... మాట వినవు... అంటూ... కోపంతో రగిలిపోతూ... ఆమె పీక పట్టుకున్నాడు. అవును... నా శాలరీ రూ.12 వేలే. నువ్వు చస్తే... అప్పుడు... ఆ డబ్బుతో నేను ఒక్కడినే ఏ గోలా లేకుండా బతకగలను. నువ్వు చావాల్సిందే. అంటూ గట్టిగా పీక పిసికేశాడు. ఆమె ఎంతలా వదిలించుకుందామని ప్రయత్నించినా... కుదరలేదు. చివరికి అనుమానపు భర్త చేతిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. పెళ్లైన ఏడాదికే... ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయింది.

ఆవేశంలో హత్య చేసిన కల్లేష్... ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదు అనుకున్నాడు. తన అన్నయ్య క్రిష్ణప్ప (33)ను ఇంటికి పిలిపించాడు. అతనికి విషయం చెప్పాడు. ఆశ్చర్యపోయిన క్రిష్ణప్ప... తమ్ముణ్ని కాపాడుకోవడమే బెటరనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమె శవాన్ని రాత్రివేళ బైక్‌పై ఎక్కించారు. ఆమెను మధ్యలో కూర్చో పెట్టి... ఊరి చివరకు తీసుకెళ్లారు. గొయ్యి తీసి శవాన్ని కప్పెట్టేశారు. మర్నాడు... ఫుడ్ డెలివరీకి వెళ్లి... పని మధ్యలో... శిల్ప పేరెంట్స్‌కి కాల్ చేసిన కల్లేష్... శిల్ప ఇంట్లోంచీ పారిపోయిందనీ, ఆమెకు ఎవరితోనో సంబంధం ఉందనీ నాటకాలాడాడు.

కల్లేష్‌పై అనుమానంతో ఉన్న శిల్ప తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు... కల్లేష్‌ని అదుపులోకి తీసుకొని... నాలుగు బాదారు. నిజం బయటికొచ్చింది. అతన్ని అరెస్టు చేసి, క్రిష్ణప్పను కూడా పట్టుకున్నారు.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading