స్విగ్గి పేరుతో బీరు డెలివరీ... యువకుడి అరెస్ట్

మహిద అనే యువకుడు ఏడు నెలల క్రితం స్విగ్గిలో జాయిన్ అయ్యాడు. స్విగ్గి సంస్థ ఇచ్చిన బ్యాగ్‌లో ఫుడ్ ఆర్డర్‌తో పాటు.. కస్టమర్లకు బీర్‌ను కూడా డెలివరీ చేయడం ప్రారంభించాడు.

news18-telugu
Updated: August 19, 2019, 9:12 AM IST
స్విగ్గి పేరుతో బీరు డెలివరీ... యువకుడి అరెస్ట్
నమూనా చిత్రం
  • Share this:
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే సంస్థ స్విగ్గిలో పనిచేస్తున్న ఓ యవకుడు కస్టమర్లకు బీర్లను సరఫరా చేయడం ప్రారంభించాడు. అడిగినప్పుడల్లా ఎవరికి కావాలంటే వారికి బీర్ల కేసుల్ని హోమ్ డెలివరీ చేశాడు. పార్టీలు, పంక్షన్లు సమయంలో స్విగ్గి సంస్థ ఇచ్చిన బ్యాగ్‌లో బీర్లను దాచి... డోర్ డెలివరీ చేశాడు. ఈ నేపథ్యంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వడోదరలో మహిద అనే యువకుడు ఏడు నెలల క్రితం స్విగ్గిలో జాయిన్ అయ్యాడు. స్విగ్గి సంస్థ ఇచ్చిన బ్యాగ్‌లో ఫుడ్ ఆర్డర్‌తో పాటు.. కస్టమర్లకు బీర్‌ను కూడా డెలివరీ చేయడం ప్రారంభించాడు. అలా ఓ కస్టమర్ కోసం బీర్ బాటిల్స్‌ను తీసుకువెళ్తుండగా అతడ్ని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ బీఏ చౌదరి తెలిపారు. లక్ష్మీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి వద్ద నుంచి సెల్ ఫోన్‌, బైకుతో పాటు రూ.47నగదును స్వాధీనం చేసుకున్నారు.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading