వామ్మో... ఫుడ్ డెలివరీ ఇచ్చి... కుక్కను ఎత్తుకుపోయాడు

Pune : ఫుడ్ డెలివరీ బాయ్ కుక్కను ఎత్తుకుపోయి ఉంటాడనే అనుమానంతో... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఐతే... పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా... పరిశీలిస్తామని మాత్రమే అనడంతో ఆ దంపతులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

news18-telugu
Updated: October 9, 2019, 10:46 AM IST
వామ్మో... ఫుడ్ డెలివరీ ఇచ్చి... కుక్కను ఎత్తుకుపోయాడు
కిడ్నాపైన కుక్క (credit - twitter - ANI)
  • Share this:
మహారాష్ట్రలోని పుణెలో జరిగిందీ షాకింగ్ ఘటన. సాధారణంగా డెలీవరీ బాయ్స్... మనం ఆర్డరిచ్చిన ఐటెం తెచ్చి ఇస్తారు. అది ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు... ఫుడ్ ఐటెమ్ కావచ్చు. కానీ... వందనా షా అనే బాధితురాలు... తనకు జరిగిన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ఏంటంటే... మధ్యాహ్నం వేళ ఆమె ఇంటికి వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్... ఆమె ఫ్యామిలీ పెంచుకుంటున్న డొట్టు కుక్కను పట్టుకుపోయాడు. సీసీకెమెరా ఫుటేజ్ చూడగా... చివరిసారిగా ఆ కుక్క ఇంటి లోపల, ఆవరణలో ఆడుకుంటూ కనిపించింది. ఆ తర్వాత అది పక్కనే ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కుక్క మాయమైన కొన్ని గంటల తర్వాత... అది ఏమైపోయిందా అని కంగారుపడ్డారు. చుట్టుపక్కల వాళ్లను అడిగితే తమకు తెలియదన్నారు. ఫుడ్ డెలివరీ బాయ్ ఎత్తుకుపోయి ఉంటాడనే అనుమానంతో... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఐతే... పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా... పరిశీలిస్తామని మాత్రమే అనడంతో ఆ దంపతులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

వాళ్ల అనుమానం నిజమైంది. ఆ ఫ్యామిలీకి దగ్గర్లోనే ఉన్న ఓ ఈటరీలో (హోటల్ లాంటిది)... ఓ కుర్రాడు కుక్క ఆచూకీ చెప్పాడు. తన కొలీగ్ దగ్గర ఓ కుక్క ఉండటాన్ని తాను చూశానని అన్నాడు. ఆ కుక్కను అతను తనతో తీసుకెళ్లాడని కూడా చెప్పాడు. ఆ తర్వాత వందనా షా... కుక్కతో డెలివరీ బాయ్ తీసుకున్న ఫొటోను కూడా సేకరించారు. ఆ డెలివరీ బాయ్... జొమాటోలో పనిచేస్తున్న తుషార్ అని తెలిసింది.

తుషార్ ఫోన్ నంబర్ తెలుసుకొని... అతనికి కాల్ చెయ్యగా... ఆ కుక్క వాళ్లదని తనకు తెలియదన్నాడు. ముద్దుగా ఉంది కదా అని తనతో తీసుకెళ్లానని చెప్పాడు. కుక్కను తిరిగి ఇవ్వమంటే... దాన్ని తన సొంతూరికి పంపించేశానని అన్నాడు. దాంతో వందనా షా దంపతులు షాక్ అయ్యారు. కుక్కను తిరిగి ఇచ్చేస్తే డబ్బులు కూడా ఇస్తామన్నారు ఆ బాధిత దంపతులు. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పిన తుషార్... చివరకు మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు.

షా దంపతులు... జొమాటో యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చారు. తమ బీగిల్ కుక్క వెనక్కి వచ్చేసేలా సాయం చెయ్యాలని ట్విట్టర్ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన జొమాటో... ఇలాంటి చర్యల్ని క్షమించే ప్రసక్తి లేదని తెలిపింది. ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారో ఆ వివరాల్ని పంపమని కోరింది. వెంటనే తమ సిబ్బందిని పంపి... సమస్యను సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చింది. తమ పప్పీ కోసం ఆ కపుల్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

Pics : బిగ్ బాస్ బ్యూటీ నివేదితా సొగసరి అందాలుఇవి కూడా చదవండి :

మాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త... పోలీసుల తాజా హెచ్చరికలు

జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు... మళ్లీ తెరచుకున్న స్కూళ్లు

Rain Alert : నేడు హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన...

ఐదో రోజు ఆర్టీసీ సమ్మె... నేడు ప్రభుత్వం, ఉద్యోగులు, అఖిలపక్షాల వేర్వేరు భేటీలు
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading