హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఫుడ్ డెలివరీ బాయ్ పాడుపని.. టీనేజ్ యువతికి ముద్దులు.. ట్విస్ట్ ఏంటంటే..

ఫుడ్ డెలివరీ బాయ్ పాడుపని.. టీనేజ్ యువతికి ముద్దులు.. ట్విస్ట్ ఏంటంటే..

రయీస్ షేక్ (ఫైల్)

రయీస్ షేక్ (ఫైల్)

Pune: ఫుడ్ డెలివరీ ఏజెంట్ యువతికి ఫుడ్ ఇచ్చాడు. ఆ తర్వాత దాహాంగా ఉందని, తాగడానికి నీళ్లు ఇవ్వాలని కోరాడు. ఆమె ఇంటిలోపలికి వెళ్లగానే మెల్లగా ఆమెను ఫాలో అయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

అమ్మాయిలు సింగిల్ గా కన్పిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక వంకతో యువతులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ప్రతిరోజు ఏదో ఒక చోటు అనేక కారణాలతో మహిళలు, అమ్మాయిలపై అత్యాచారాలు వెలుగులోనికి వస్తునే ఉన్నాయి. గుడి,బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇంట్లో కూడా మహిళలకు భద్రతకరువైందని చెప్పుకొవచ్చు. ఇక పోలీసు స్టేషన్ లో కూడా దారుణాలు జరుగుతున్న ఘటనలు వార్తలలో నిలిచాయి. ప్రభుత్వాలు దిశ, నిర్భయ, పోక్సో చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడంలేదు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు... మహారాష్ట్రలోని పూణెలో (Pune) దారుణమైన ఘటన జరిగింది. ఒక యువతి జోమాటో ఫుడ్ యాప్ తో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అప్పుడు ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమె సింగిల్ గా ఉండటాన్నిచూశాడు. తాగడానికి నీళ్లు ఇవ్వాలని కోరాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే ఆమెనే ఫాలో అయ్యాడు. వెనుకవైపు నుంచి బలవంతంగా పట్టుకుని ఆమెకు ముద్దులు పెట్టాడు. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి షాకింగ్ లో ఉండిపోయింది. కాసేపటికి తెరుకుని మరో స్నేహితుడికి కాల్ చేసి జరిగిన దారుణాన్ని చెప్పింది.

దీంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో జోమాటో డెలివరీ బాయ్ పై ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులకు ట్విస్ట్ ఎదురైంది. అఘాయిత్యానికి పాల్పడింది జోమాటో ఏజెంట్ కాదని తెలిసింది. కాగా, జోమాటో డన్జో యాప్‌తో డెలివరీని మార్చుకుంది. దీనిలో 39 ఏళ్ల రయీస్ షేక్ అనే వ్యక్తి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో యువతి ఇంట్లో ప్రవేశించాడు. యువతి సింగిల్ గా ఉండటం గమనించాడు. వెంటనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన జరిగింది.

జలౌన్ జిల్లాలోని ఒరాయ్ నగరంలో ఒక యువతిని తాగుబోతు వేధించాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తాగిన మైకంలో యువతిని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. దీంతో యువతి ఎంత చెప్పిన అతను వినలేడు. దీంతో ఆమె తనకు తెలిసిన వారిని రప్పించింది. కామాంధుడిని అందరిముందే రోడ్డు మీద కూర్చోబెట్టింది. అంతే కాకుండా.. అతడిని చెప్పుతో చితక్కొట్టింది.

దాదాపు.. 20 సెకన్లపాటు.. 40 సార్లు తలపై చెప్పుతో కసితిరా బాదింది. దీంతో అక్కడున్న వారంతా భలే కొడుతుందే అంటూ ఇంట్రెస్టింగ్ గా చూశారు. ఎవరు కూడా యువతిని ఆపే సాహాసం మాత్రం చేయడం లేదు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. భలే కొడుతుంది.. ఇంకొసారి ఏవడు అమ్మాయిల జోలికిపోడు ఈ వీడియో చూస్తే అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Food delivery, Pune

ఉత్తమ కథలు