ఫోక్ సింగర్ హత్య.. సహజీవనం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఆమె గొంతెమ్మ కోరికలు కోరుతోందని, వాటిని తీర్చలేక వదిలించుకోవాలనే ప్రయత్నంలో హత్య చేయించినట్టు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.

news18-telugu
Updated: October 7, 2019, 2:48 PM IST
ఫోక్ సింగర్ హత్య.. సహజీవనం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫోక్ సింగ్ సుష్మ హత్య కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 1న గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఫోక్ సింగర్ సుష్మ హత్య జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఉదయం 8.30 గంటల సమయంలో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసును విచారించిన పోలీసులు.. ఆమె హత్య వెనుక సుష్మాతో సహజీవనం చేస్తున్న గజేంద్ర భాటి అనే వ్యక్తి హస్తం ఉందని గుర్తించారు. 2014లో సుష్మా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత గజేంద్ర భాటితో సహజీవనం చేస్తోంది. అయితే, కొంతకాలంగా ఆమె గొంతెమ్మ కోరికలు కోరుతోందని, వాటిని తీర్చలేక వదిలించుకోవాలనే ప్రయత్నంలో హత్య చేయించినట్టు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.

సుష్మాను హత్య చేయడానికి భాటి ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెల రోజుల క్రితం ఆ కిల్లర్ ఆమె మీద దాడి చేశాడు. అయితే, ప్రాణాలతో బయటపడింది. ఈసారి అతి దగ్గరి నుంచి కాల్చి చంపాడు. అయితే, ఆ కాంట్రాక్ట్ కిల్లర్ కోసం కొన్ని రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఓ ఎన్‌కౌంటర్‌లో కాలికి తీవ్ర గాయాలై ఆ కిల్లర్ పోలీసులకు దొరికిపోయాడు. అతడిని పట్టుకుని గట్టిగా ప్రశ్నిస్తే ఫోక్ సింగర్‌ను కూడా తానే హత్య చేశానని అంగీకరించాడు. సుష్మాతో సహజీవనం చేస్తున్న గజేంద్ర భాటి తనకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చాడని వెల్లడించాడు. హంతకుడు ఇచ్చిన సమాచారంతో భాటిని అరెస్ట్ చేశారు.

మందు బంద్ చేస్తేనే పిల్లలు పుడతారు..First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>