పుట్టినరోజున వెరైటీగా ఉండాలని నగ్నంగా బయటికి వచ్చి... పబ్లిక్ పార్కులో...

ఫ్లోరిడాలోని లాంగ్‌వుడ్ ఏరియాలో ఒంటిమీద నూలుపోగు లేకుండా పబ్లిక్ పార్కులో బాస్కెట్‌‌బాల్ ఆడుతూ కనిపించిన యువకుడు... ఎందుకిలా చేస్తున్నావని అడిగిన పోలీసులకు దిమ్మదిరిగే సమాధానం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 15, 2019, 3:27 PM IST
పుట్టినరోజున వెరైటీగా ఉండాలని నగ్నంగా బయటికి వచ్చి... పబ్లిక్ పార్కులో...
పుట్టినరోజున వెరైటీగా ఉండాలని నగ్నంగా బయటికి వచ్చి... ఒంటిమీద నూలుపోగు లేకుండా పార్కులో...
  • Share this:
పుట్టినరోజున వెరైటీగా ఉండాలని నిర్ణయించుకున్న అతను... క్రేజీగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చింది, ఆలస్యం ఎందుకని... ఒంటిమీద దుస్తులన్నీ తీసేసి నగ్నంగా రోడ్డు మీదకి వచ్చాడు. స్థానికులకు భయభ్రాంతులకు గురి చేసిన ఈ సంఘటన ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాలోని లాంగ్‌వుడ్ ఏరియాకు చెందిన 29 ఏళ్ల జోర్డాన్ గ్లేన్ అండర్సన్... తన పుట్టినరోజున ఏదైనా క్రేజీగా చేయాలని భావించాడు. కొత్తబట్టలు వేసుకుని ఏ ఫైవ్‌స్టార్ హోటెల్‌లోనో పార్టీ ఇస్తే వచ్చే ఆనందంలో కిక్ లేదని భావించాడు. వెంటనే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి రోడ్డు మీదకి వచ్చాడు. ఓ పబ్లిక్ పార్కులోకి అలా వెళ్లిపోయి ఒక్కడే బాస్కెట్ బాల్ ఆడడం మొదలెట్టాడు. నగ్నంగా ఆడుకుంటున్న యువకుడిని చూసి షాక్‌ అయిన పార్క్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... జోర్డాన్‌ను ఎందుకిలా చేస్తున్నావని అడగారు. దానికి అతను ఒంటరిగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పడంతో అది విని షాక్ అయ్యారు పోలీసులు. న్యూడ్‌గా బయటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని అతనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు... అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అమెరికాలో ముఖ్యంగా ఫ్లోరిడా ఈ న్యూడ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది.

కొన్నిరోజుల కిందట ఫ్లోరిడాలో ఓ రెస్ట్ స్టాప్ దగ్గర ముగ్గురు యువతులు, కారులో నగ్నంగా వెళ్తుండడాన్ని గమనించారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయిలు... కారును వేగంగా పోనిచ్చారు. వారిని వెంబడిస్తూ పోలీసు వాహనం కూడా ఆ కారు వెనకే దూసుకొచ్చింది. ఇలా గంటకు పైగా ఛేజ్ చేసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మితిమీరిన వేగంతో దాదాపు 33 కిలోమీటర్ల దూరం వెళ్లారు ఆ ముగ్గురు యువతులు. ఎందుకిలా నగ్నంగా తిరుగుతున్నారని అడిగిన పోలీసులకు ఆ అమ్మాయిలు చెప్పిన సమాధానం విని, దిమ్మతిరిగినంత పనైంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నామని.. లోషన్ అంటుతుందనే ఉద్దేశంతో బట్టలు తీసేశామని చెప్పారు యువతులు.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>