ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?

Flipkart : మన దేశంలో ఆన్‌లైన్‌లో రోజూ కొన్ని కోట్ల వస్తువులు అమ్ముడవుతున్నాయి. వాటిలో అప్పుడప్పుడూ ఒకటి ఆర్డరిస్తే మరొకటి వెళ్తున్నాయి. ముంబైలో డబ్బావాలాలు ఎప్పుడూ ఇలాంటి తేడాలు చెయ్యలేదు. మరి ఆన్‌లైన్ సంస్థలు ఎందుకు రాంగ్ స్టెప్ వేస్తున్నాయి?

news18-telugu
Updated: December 3, 2019, 7:20 AM IST
ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?
ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...? (credit - twitter - BGR India)
  • Share this:
Flipkart : ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్... కేరళలోని ఓ కస్టమర్‌కి షాక్ ఇచ్చింది. వారం పాటూ వెతికి... చాలా రివ్యూలు చదివి... చివరకు విష్ణు సురేష్ ఓ కెమెరా కోసం ఆర్డరిచ్చాడు. ఆ కెమెరా రేటు రూ.27,500. అంత పెద్ద ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫ్లిప్‌కార్డ్ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాంటిది ఆ సంస్థ పంపిన పార్శిల్ ఓపెన్ చేస్తే... అందులో టైల్స్ ఉన్నాయి. అవి చూసి సురేష్ షాకవకుండా ఎలా ఉంటాడు? ఫ్లిప్‌కార్ట్‌కి ఈకార్ట్ లాజిస్టిక్స్ అనే సహ సంస్థ ఉంది. దాని ద్వారా నవంబర్ 24న ఆర్డర్ చేశాడు సురేష్. అతనికి అనుకోకుండా టైల్స్ పంపించారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే... పార్శిల్‌లో టైల్స్ (నాపరాళ్లు)తోపాటూ... కెమెరా మాన్యువల్, వారంటీ కార్డ్ కూడా ఉన్నాయి. వెంటనే సురేష్... ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి కాల్ చేశాడు. వారంలోగా కొత్త కెమెరా పంపుతామని అవతలి వాళ్లు చెప్పారు. దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేదేంటీ... ఆన్‌లైన్ ఈ కామర్స్‌కి క్రేజ్ పెరుగుతున్నా... ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇలా ఎందుకు జరిగింది? : తప్పుడు పార్శిల్ ఎందుకు వచ్చిందో ఫ్లిప్‌కార్ట్ చెప్పలేదు. వారంలో కొత్త కెమెరా పంపుతామందంటే... దానర్థం తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే. ఇలాంటివి ఇదివరకూ కూడా చాలా జరిగాయి. డెలివరీ బాయ్స్ కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్న వాదనలు ఉన్నాయి.

గతేడాది ఓ వ్యక్తి... ఐఫోన్ 8 కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇస్తే... మొబైల్ బదులు సోప్ బార్ వచ్చింది. 2015లో అమెజాన్, ప్లిప్‌కార్ట్ ఏజెంట్లు... నోడియా, ఘజియాబాద్‌లో పార్సిల్స్ డెలివరీ చెయ్యడానికి భయపడ్డారు. రూ.10 వేలకు మించిన పార్శిళ్లను తాము డెలివరీ చెయ్యబోమని పట్టుపట్టారు. ఎందుకంటే... పార్శిల్ తేడా వస్తే... తమను నిందిస్తున్నారన్నది వాళ్ల కోణం. ఇలా ఆన్‌లైన్ ఈ-కామర్స్‌లో ఏది కొన్నా కచ్చితమైన ఐటెమ్ వస్తుందన్న గ్యారెంటీ ఉండట్లేదు. అందుకే చాలా మంది పార్శిల్ రాగానే... మొబైల్ వీడియో రికార్డర్ ఆన్ చేసి... పార్శిల్‌ను వీడియో తీస్తూ... అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే రాంగ్ పార్శిల్ వస్తే... ఆధారంగా చూపించడానికి ఆ వీడియో ఉపయోగపడుతోంది.

 

Pics : అందాల జల్లు కురిపిస్తున్న రష్మిక మందన్నఇవి కూడా చదవండి :చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా...

టార్గెట్ జగన్... ఆ మూడు పార్టీలూ కలిసి వ్యూహాలు?

పౌల్ట్రీ ఫారాలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్

పేదలకు ఇళ్లపై జగన్ ప్రభుత్వం కొత్త రూల్స్... వెంటనే అప్లై చెయ్యండి

Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...
Published by: Krishna Kumar N
First published: December 3, 2019, 7:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading