విమానంలో ఊపిరిఆడక ప్రయాణికుడికి పక్షవాతం...మృతి...

ఎమర్జన్సీ తలెత్తడంతో వెంటనే విమనాన్ని భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసి ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రి చేరుకునేలోపు ఆప్రయాణికుడు దారిలోనే మృతి చెందాడు.

news18-telugu
Updated: September 8, 2019, 10:45 PM IST
విమానంలో ఊపిరిఆడక ప్రయాణికుడికి పక్షవాతం...మృతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చెన్నై నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో ఒక ప్రయాణికుడి హఠాన్మరణంతో అంతా షాక్ లోకి జారుకున్నారు. ఎయిర్ లైన్ కంపెనీ స్పైస్ జెట్-623 విమానం చెన్నై నుంచి కోల్‌కతా వెళ్తున్నప్పుడు ఓ ప్రయాణికుడు పక్షవాతం బారిన పడటంతో అస్వస్థతకు గురయ్యాడు. ఎమర్జన్సీ తలెత్తడంతో పైలట్ ముందస్తు సమాచారాన్ని ఇవ్వగా, వెంటనే  విమనాన్ని భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసి ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రి చేరుకునేలోపు ఆప్రయాణికుడు దారిలోనే మృతి చెందాడు. కాగా విమానంలో ఊపిరి ఆడకపోవడం వల్లనే ఆ ప్రయాణికుడికి పక్షవాతం వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న కారణంగా కూడా సదరు ప్రయాణికుడికి పక్షవాతం వచ్చి ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా మృతిచెందిన ప్యాసింజర్ పేరును అశోక్ కుమార్ అని గుర్తించారు. అతడి వయస్సు 48  సంవత్సరాలు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు