దారుణం.. బతుకుదెరువు కోసం వస్తే.. ఉసురు తీసిన ఊర కుక్కలు..

కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన ఓ కుటుంబం తన ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని బతుకుదెరువు కోసం ములుగు జిల్లాకు వలస వచ్చింది.

news18-telugu
Updated: July 11, 2020, 1:19 PM IST
దారుణం.. బతుకుదెరువు కోసం వస్తే.. ఉసురు తీసిన ఊర కుక్కలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం ఓ కుటుంబం ఇతర రాష్ట్రం నుంచి వలస వచ్చింది. స్థానికంగా పైపులైన్ పనులు చేసేందుకు తల్లిదండ్రులు వెళ్లగా, ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ సమీపంలోని గుట్టపైకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఊర కుక్కలు బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కొద్దిసేపటికి బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన ఓ కుటుంబం తన ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని బతుకుదెరువు కోసం ములుగు జిల్లాకు వలస వచ్చింది. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో రామప్ప-పాకాల పైపులైన్ పనులు చేసేందుకు ఇక్కడికి వచ్చారు. స్థానికంగా తాత్కాలిక గూడారాలు వేసుకుని జీవిస్తున్నారు. ఆ కుటుంబం రెండు నెలలుగా పైపులైన్ పనులు చేస్తున్నారు. రోజులాగే శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పైపులైన్ పనులు చేసేందుకు వెళ్లారు.

కాగా ఐదేళ్ల కుమారుడు చిరంజీవి ఆడుకుంటూ సమీపంలోని గుట్టపైకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఊర కుక్కలు బాలుడు ఒంటరిగా రావడాన్ని గమనించాయి. అంతే ఒక్క ఊదుటున బాలుడికి దూకి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఉన్నంతలోనే అల్లారుముద్ధుగా పెంచుకున్న తన కొడుకుకు కుక్కలు చంపడంతో తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటన స్థానికంగా భయోత్పాతాన్ని సృష్టించింది.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading