నాన్న బెడ్రూమ్‌లో మరొకరితో ‘అమ్మ’... చూసిన బాలుడ్ని చంపేసి...

ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు. బాలుడికి సొంత పెదనాన్న. ఈ విషయం తన భర్తకు ఎక్కడ చెప్పేస్తాడో అని ఆ సవతి తల్లి సందేహించింది.

news18-telugu
Updated: September 15, 2019, 9:08 PM IST
నాన్న బెడ్రూమ్‌లో మరొకరితో ‘అమ్మ’... చూసిన బాలుడ్ని చంపేసి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 15, 2019, 9:08 PM IST
అన్నెం పున్నెం ఎరుగని ఓ ఐదేళ్ల కొడుకుని అన్యాయంగా చంపేసింది అతడి సవతి తల్లి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఉన్న కప్సాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య చనిపోవడంతో మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు. అయితే, అతడికి అప్పటికే మొదటి భార్య నుంచి ఓ కొడుకు ఉన్నారు. కానీ, ఆ బాలుడంటే సవితి తల్లికి నచ్చలేదు. అయితే, తాజాగా ఓ రోజు ఆమె, మరో వ్యక్తితో బెడ్రూమ్‌లో బాలుడి కంట పడింది. అయితే, ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు. బాలుడికి సొంత పెదనాన్న. ఈ విషయం తన భర్తకు ఎక్కడ చెప్పేస్తాడో అని ఆ సవతి తల్లి సందేహించింది. ఆ బాలుడిని గొంతుపిసికి చంపేసింది. బెడ్ బాక్స్‌లో ఆ శవాన్ని దాచిపెట్టింది. గత గురువారం ఈ ఘటన జరిగింది. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి కంగారుపడి చుట్టుపక్కల వెతికాడు. అయితే, సవతి తల్లి మీద అనుమానం రావడంతో చుట్టుపక్కల వారు గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. బెడ్ బాక్స్‌లో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు.... నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...