కర్ణాటకలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఐదుగురు ఆరెస్ట్...

ఆలస్యంగా వెలుగుజూసిన ఘటన ఇది. ఆ వాట్సావ్ వీడియో బయటకు రాకపోయి వుంటే... ఆ దారుణం బయటపడేది కాదు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 4, 2019, 8:35 AM IST
కర్ణాటకలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఐదుగురు ఆరెస్ట్...
గ్యాంగ్ రేప్ నిందితులు (Image : Twitter / Srivatsa)
  • Share this:
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిందీ ఘటన. బాధితురాలు చదివే కాలేజీలోనే చదువుతున్న మరో కుర్రాడు... రోజూ ఆమె ఎటు వెళ్తోందో గమనించేవాడు. బస్సు దిగిన తర్వాత ఆమె ఒంటరిగా వెళ్తోందని గ్రహించాడు. కాలేజీలోని మరో నలుగురు కుర్రాళ్లకు ఈ విషయం చెప్పాడు. ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని పక్కనున్న అడవిలోకి ఎత్తుకుపోదామని అందరూ స్కెచ్ వేశారు. ఏప్రిల్ 3న ప్లాన్ అమలు చేశారు. బాధితురాలు... రోజూ లాగే... బస్సు దిగి ఇంటికి వెళ్తోంది. సాయంత్రం ఆరు గంటల సమయం. ఆమెను వెంటాడిన ఐదుగురూ... నోరు నొక్కి బలవంతంగా చెట్లలోకి లాక్కుపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా గ్యాంగ్ రేప్ చేశారు. ఇదంతా కాలేజీ కుర్రాడు వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే... వీడియోని ఇంటర్నెట్‌లో పెడతామని భయపెట్టారు. ఆ భయంకొద్దీ అభాగ్యురాలు... సైలెంటైపోయింది.

మూడు నెలల తర్వాత... ఆ వీడియోలో చిన్న పార్టుని వాట్సాప్‌లో షేర్ చేశాడు ఆ కాలేజీ కుర్రాడు. అది కాస్తా వైరల్ అయ్యి... చాలా మందికి షేరింగ్ అయ్యింది. విషయం పోలీసులకు తెలిసింది. సుమోటోగా కేసు నమోదుచేసి... వాట్సాప్ అధారంగా ఆ కాలేజీ కుర్రాణ్ని పట్టుకున్నాడు. వాడికి నాలుగు తగిలించేసరికి... నిజం బయటపెట్టాడు. బాధితురాలి ద్వారా కంప్లైంట్ నమోదు చేసిన పోలీసులు... ఆ కుర్రాడితోపాటూ... గ్యాంగ్‌రేప్‌ చేసిన మిగతా నలుగురిని కూడా అరెస్టు చేశారు.

గ్యాంగ్ రేప్‌తోపాటూ... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద కూడా కేసు రాసిన పోలీసులు... ఆ వీడియోని డిలీట్ చేయించారు.

First published: July 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>