ఈతకు వెళ్లి ఐదుగురు బాలికల మృతి... గద్వాల జిల్లాలో పెను విషాదం...

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని నాగర్‌దొడ్డి గ్రామంలో విషాదం... ఈతకు వెళ్లి ఐదుగురు బాలికలు మృతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 5:36 PM IST
ఈతకు వెళ్లి ఐదుగురు బాలికల మృతి... గద్వాల జిల్లాలో పెను విషాదం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు, నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 12 ఏళ్ల లోపు చిన్నారులే కావడం స్థానికంగా విషాదం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన 12 ఏళ్ల మేఘన, 12 ఏళ్ల కవిత, 10 ఏళ్ల యమున, ఏడేళ్ల వెంకటేశ్వరి, ఏడేళ్ల చిన్నారి... కలిసి పాఠశాలకు వెల్లారు. మధ్యాహ్న సమయానికి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం ఇంట్లో ఉన్న ఆవును తీసుకుని, మేపుకు వచ్చేందుకు పొలానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం 4:30 గం.ల సమయంలో ఐదుగురూ కలిసి పొలం దగ్గర ఉన్న రిజర్వాయర్ సమీపానికి చేరుకున్నారు. ఆవును మేపుకుంటూ నీటిలో దిగుతూ ఆడుకుంటున్న చిన్నారులు... ప్రమాదవశాత్తు పెద్దగుంతలో పడి మునిగిపోయారు. ముందు ఆవుతోక పట్టుకున్న ఏడేళ్ల చిన్నారి నీటిగుంతలో పడిపోగా, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి, ఒక్కొక్కరుగా అందరూ నీటిలో పడిపోయారు. కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసినా, అక్కడికి దగ్గర్లో ఎవ్వరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చిన్నారులకు ఈత రాకపోవడంతో నీటిలో ముగిని ప్రాణాలు కోల్పోయారు. యమున తండ్రి ఫోన్‌ ఇంట్లో పెట్టి కూలి పనికి వెళ్లాడు. ఆ ఫోన్ తీసుకుని, ఆడుకుంటూ స్నేహితులతో కలిసి రిజర్వాయర్ ఉన్న ప్రాంతానికి యమున. అయితే నీటిలో తడిసిపోతుందనే ఉద్దేశంతో ఈత కోసం నీళ్లలో దిగేముందు ఒడ్డుమీదనే పెట్టింది.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన యమున తండ్రి, ఆవును పొలం దగ్గర చూశానని చెప్పిన స్నేహితుడు కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి, రిజర్వాయర్‌లో వెతకగా పిల్లలు విగతజీవులై కనిపించారు. ఈ ఐదుగురు చిన్నారుల రెండు కుటుంబాలకు చెందిన పిల్లలే కావడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదయం నవ్వుకుంటూ బడికెళ్లిన పిల్లలు, సాయంత్రానికల్లా ఈ విగతజీవులై కనిపించడంతో గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading