హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video : బైక్‌పై వెళ్లారు.. ఐదుగురు అరెస్ట్ అయ్యారు.. కారణం ఇదే

Viral Video : బైక్‌పై వెళ్లారు.. ఐదుగురు అరెస్ట్ అయ్యారు.. కారణం ఇదే

బైక్‌పై వెళ్లారు.. ఐదుగురు అరెస్ట్ అయ్యారు (image credit - twitter - @bhavi_kap)

బైక్‌పై వెళ్లారు.. ఐదుగురు అరెస్ట్ అయ్యారు (image credit - twitter - @bhavi_kap)

Viral Video : మన దేశంలో జనాభా ఎక్కువ కావడంతో.. మనకు వాహనాలపై పరిమితికి మించి ప్రయాణించడం అలవాటు. టూవీలర్‌పై ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. చట్టప్రకారం అది నేరం. అలా ప్రయాణించిన ఐదుగురిపై కేసు రాసిన పోలీసులు.. వారిని జైల్లో పెట్టారు. ఆ వీడియో చూడండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Viral Video : చిన్న చిన్న నేరాలే ఒక్కోసారి జైలుపాలు చేస్తాయి. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌ (madhya pradesh)లో జరిగింది. ఐదురుగు వ్యక్తులు ఒకే బైకుపై ప్రయాణించి.. అరెస్ట్ అయ్యారు. వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అది పోలీసుల కంటపడింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారని చర్యలు తీసుకున్నారు. నిందితులపై మోటర్ వాహనాల చట్టం (Motor Vehicles Act) ప్రకారం కేసు రాసిన పోలీసులు.. వారికి రూ.6,500 ఛలాన్ వేశారు. అక్కడితే వదిలెయ్యలేదు. ప్రజలకు అశాంతి కలిగించారంటూ.. అరెస్టు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టి.. తర్వాత జైలుకు పంపారు.

"సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని పరిశీలించాం. ఐదురుగు వ్యక్తులు ఒకే బైక్‌పై వెళ్తూ కనిపించారు. ఆ వాహనం నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించింది. దాని ఆధారంగా వారిని గుర్తించి చర్యలు తీసుకున్నాం. బైక్‌ని స్వాధీనం చేసుకొని.. ఐదుగురినీ అరెస్టు చేశాం" అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) తెలిపారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

చూశారుగా.. బైక్‌పై ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఎవరూ చెయ్యని సాహసం తాము చేస్తున్నామని ఫీలవుతున్నారు. కానీ వారు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని గ్రహించలేకపోయారు. ఇలాంటి తప్పులే.. మన కెరీర్‌ని దెబ్బతీస్తాయంటున్నారు పోలీసులు. వైరల్ అవ్వాలనే తాపత్రయంలో.. రూల్స్ బ్రేక్ చేస్తే.. లైఫే లేకుండా పోతుందని చెబుతున్నారు.

వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి రయీస్ అహ్మద్ అని తెలిసింది. మిగతా నిందితులు అరిఫ్, అసిఫ్, ఇర్షద్, షామిమ్ అని తెలిసింది, వీరంతా మొరాదాబాద్ లోని అసలత్‌పురాలో ఉంటున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో బైక్ నడిపి.. అడ్డంగా బుక్కయ్యారు. టూవీలర్‌పై ఇద్దరే ప్రయాణించాలి. ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకోవాలి. ఇలాంటి రూల్స్ ఏవీ వీళ్లు పాటించలేదని వీడియో చూస్తే అర్థమవుతుంది.

First published:

Tags: 30 Years Prudhvi Raj, Telugu news, VIRAL NEWS

ఉత్తమ కథలు