Home /News /crime /

FIVE PEOPLE FROM SAME FAMILY MISSING IN NELLORE SU

ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు మిస్సింగ్.. నెల్లూరులో కలకలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది.

    నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. జిల్లాలోని వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామం ఒకే కుటుంబంలోని ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారుల అదృశ్యం మిస్టరీగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిన ఈ ఐదుగురు రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జీకేపల్లికి చెందిన కృష్ణయ్య, సుధాకర్‌ అన్నదమ్ములు. వీరిద్దరు వారి బంధువుల అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. కృష్ణయ్యకు విజయతో వివాహం జరగగా.. వీరికి శ్రీవేణి(3), దివ్యశ్రీ(7 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుధాకర్‌కు సుప్రియతో పెళ్లి జరగగా.. వీరికి సురేఖ(2) ఉంది.

    చిన్నారి దివ్యశ్రీకి అనారోగ్యంగా ఉండటంతో.. ఆమెను విజయ, సుప్రియలు సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వీరు మిగతా పిల్లల్ని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యం ఆలస్యం కావడం, నెబ్యులైజర్ సౌకర్యం లేకపోవడంతో.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తామని చెప్పి వారు ఆటోలో బయలుదేరారని స్థానికులు చెప్పారు.

    మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన వారు రాత్రి వరకు కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినా కూడా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన ఆ ఐదుగురి ఆచూకీని కనుగొనేందుకు మొత్తం ఆరు బృందాలతో గాలింపు చేపట్టామని గూడురు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మహిళలు పీహెచ్‌సీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆటో ఆ ఊరికి చెందినది కాదని పోలీసుల విచారణ తెలిందన్నారు. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Missing case, Nellore Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు