పండగ పూట విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ప్రతీకారాత్మక చిత్రం

పండగ పూట వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు.

 • Share this:
  పండగ పూట వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు.. బుద్ధారంకు చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మరణించాడు. అతడి భార్య మణెమ్మ(68) గ్రామంలోనే నివసిస్తుండగా.. వారి కుమారులు హైదరాబాద్‌ృల ఉంటున్నారు. అయితే తండ్రి సంవత్సరీకంగా వారు కుటుంబాలతో కలిసి ఇటీవలే గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత.. భోజనాలు అయ్యాక మొత్తం 9 మంది ఓ గదిలో నిద్రించారు.

  అయితే అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆ గది పై కప్పు కూలిపడింది. దీంతో ఆ గదిలో నిద్రిస్తున్న మణెమ్మ, ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, అక్షయ మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

  పోలీసుల ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ఇక, ఒకే కుటుంబంలో ఐదుగురు ఇలా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
  Published by:Sumanth Kanukula
  First published: