హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road accident: ఘోరం.. వినోదంలో విషాదం.. అదుపు తప్పి బోల్తాపడిన వ్యాన్.. ఐదుగురు మృతి..

Road accident: ఘోరం.. వినోదంలో విషాదం.. అదుపు తప్పి బోల్తాపడిన వ్యాన్.. ఐదుగురు మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఐదుగురు ప్రయాణికులు తమ నిండు ప్రాణాలను కోల్పొయారు.

Five Members Of Bihu Team killed As Road Accident: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బిస్వనాథ్ జిల్లాలో ఒక కార్య క్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  దాదాపు.. 20 మంది టీనేజర్లు ప్రత్యేక వాహానం మాట్లాడుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. డ్రైవర్ గోహాపూర్ సమీపంలోనికి రాగానే వాహానం అదుపు తప్పింది. దీంతో వాహానం పల్టీలు కొట్టుకుంటు బోర్లాపడింది. ఈ ఘటనతో అప్పటి వరకు పాటలు పాడుకున్న యువకులంతా.. ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసుకుంటూ సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు.  ప్రమాదం జరిగినప్పుడు వాహానంలో దాదాపు.. 20 మంది ప్రయాణికలు ఉన్నారు.

వాహానం బోల్తాపడగానే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటన స్థలం అంతా రక్తసిక్తంగా మారిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, స్థానికులతో కలసి సహయక చర్యలు చేపట్టారు. ఘటనస్థలంలోనే ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కత గాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతి చెందిన వారిని సంజయ్ బసుమతరీ (17), కొలిమన్ బసుమతరీ (21), బోర్నాలి బోరో (15), బుదిమోతి బోరో (14), రాధిక డైమరీ (15)గా గుర్తించారు.

వ్యాన్ ప్రమాదానికి కారణం.. అత్యధిక వేగమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆస్పత్రులలో గాయపడిన వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సానుభూతి తెలిపారు.

కర్ణాటకలో గతంలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

బెంగుళూరులో విషాదకర ఘటన. బెంగుళూరు-కడపరహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పదిహేను రోజుల క్రితం కూండా బెంగళూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. హైవేపై ప్రయాణిస్తున్న కాస్లీరు ఓ కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లో చనిపోయారు. ఈ సంఘటన అర్థరాత్రి రెండు గంటల తర్వాత జరిగినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళ లోని ఓ కన్వేషన్ సెంటర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రహదారిలోని ఓ కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చేలరేగాయి.

దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు.

కాగా ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఆరుగురు మృత్యువాత పడగా మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరు కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలున్స్ తెరుచుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

First published:

Tags: Assam, Road accident

ఉత్తమ కథలు