Truck Full of Eggs: కోడి గుడ్ల లోడ్‌తో వెళుతున్న లారీ చోరీ.. ఆ తర్వాత ఏమైందో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

సెల్ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురయిన ఘటనలు గతంలో చూశాం. కానీ.. కోడి గుడ్లు తరలిస్తున్న లారీని చోరీ చేసిన ఘటన గురించి విన్నారా. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అదే జరిగింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ గ్యాంగ్ కోడి గుడ్లు తరలిస్తున్న లారీని చోరీ చేసిన ఘటన కలకలం రేపింది.

  • Share this:
    నోయిడా: సెల్ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురయిన ఘటనలు గతంలో చూశాం. కానీ.. కోడి గుడ్లు తరలిస్తున్న లారీని చోరీ చేసిన ఘటన గురించి విన్నారా. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అదే జరిగింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ గ్యాంగ్ కోడి గుడ్లు తరలిస్తున్న లారీని చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. కోడి గుడ్ల లోడ్‌తో వస్తున్న లారీని చోరీ చేస్తే రిస్క్ ఉండదనుకున్నారో ఏమో గానీ పక్కా ప్లాన్‌తో లారీని చోరీ చేశారు. హర్యానాలోని సోనిపట్ నుంచి లారీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. హర్యానా-ఉత్తరప్రదేశ్‌లో సరిహద్దులో జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను గ్రేటర్ నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఈ గ్యాంగ్ కోడి గుడ్ల లారీని చోరీ చేయడమే కాదు కొంత సరుకును కూడా అమ్మేశారు. పోలీసులు ఈ ముఠా వద్ద నుంచి కోడిగుడ్లు అమ్మగా వచ్చిన రూ.4 లక్షల డబ్బును, కోడిగుడ్లు నింపిన 47 ప్లాస్టిక్ క్రేట్లను సీజ్ చేశారు. అంతేకాదు.. లారీ డ్రైవర్‌ను బెదిరించడానికి నిందితుడు నాటు తుపాకులు, కత్తులు వాడారు. పోలీసులు నిందితులు వాడిన రెండు నాటు తుపాకులను, కత్తులను, చోరీ సమయంలో లారీని ఛేజ్ చేసేందుకు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరగ్గా.. సెప్టెంబర్ 14న సోనిపట్‌లోని కొండ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

    ఇది కూడా చదవండి: Shocking: యాక్సిడెంట్ అయి పదిరోజులుగా ఇంట్లోనే ఉన్న భర్త.. భార్యను అలా చూసి తొందరపడి ఎంతపని చేశాడంటే..

    ఈ చోరీకి పాల్పడిన నిందితులను సాహిల్, ఫిరోజ్, నదీమ్, తుషార్, విక్రమ్‌లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా గ్రేటర్ నోయిడా పరిధిలోని కుల్సేరా గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఈ యూపీ గ్యాంగ్‌పై గతంలోనే పలు కేసుల్లో అర డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి.
    Published by:Sambasiva Reddy
    First published: