Home /News /crime /

FIVE MAOISTS WERE KILLED IN A CLASH ON BETWEEN POLICE AND NAXALS IN MAHARASTRA GADCHIROLI NGS

Gadchiroli Encounter: ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టుల హతం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

అడవిలో ఫైరింగ్... ఐదుగురు నక్సలైట్లు హతం... స్పెషల్ రిపోర్ట్...(File)

అడవిలో ఫైరింగ్... ఐదుగురు నక్సలైట్లు హతం... స్పెషల్ రిపోర్ట్...(File)

ఉదయాన్నే మహారాష్ట్ర అడవుల్లో అలజడి రేగింది. గడ్చిరౌలిలోని కొబ్రామెండ అటవీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

    కొబ్రామెండ అటవీ (Khobramendha Forest) ప్రాంతంలో అలజడి చెలరేగింది. తూటాల సౌండ్లు.. అరుపులతో అడవిలో అలజడి చెలరేగింది. ఉదాయాన్నే కాళ్పల శబ్ధంతో అడవిలో జంతువుల సైతం పరుగులు పెట్టాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి (Maharastra Gadchiroli) జిల్లాలో పరిస్థితి ఇది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Naxals) మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు (Maoists) హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్టు అధికారులు నిర్ధారించారు కూడా. పోలీసులు అదనపు బలగాలతో కూంబీంగ్ ఆపరేషన్ చేపట్టారని, తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు.

    ఈ ఎన్ కౌంటర్ (Encounter) నుంచి కొందరు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయితే అలా తప్పించుకున్న వారిలో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన వారందరినీ ఏరివేసేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు స్సష్టం చేశారు. మొదట మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పక్కా సమాచారం అందడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అడవిలోకి ప్రవేశించారు పోలీసులు. అయితే పోలీసుల ఉనికి తెలియడంతో వెంటనే మావోయిస్టులు కాల్పులకు దిగారు. వారికీ ధీటుగా ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

    మొన్న శనివారం నుంచే నక్సల్స్ - పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. శనివారం జరిగిన ఎదురుకాల్పుల తరువాత అక్కడి నుంచి తప్పించుకున్న నక్స్ లైట్లను గాలించే పనిలో భాగంగా ఇవాళ పోలీసలు అడవిని జల్లెడ పట్టారు. ఈ ఎన్ కౌంటర్ తరువాత పోలీసులు భారీగా.. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొబ్రామెండ అటవీ ప్రాంతంలో సుమారు 60 నుంచి 70 మంది దాకా నక్సలైట్లు దాగి ఉంటారని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ కూంబింగ్ ఆపరేషన్ లో సుమారు 60 మంది పోలీసులు బలగాలు కూడా పాల్గొన్నాయి 

    కొబ్రామెండ అటవీ మొత్తం దట్టంగా చెట్లు అలముకొని ఉండడం.. లోయలు కూడా ఉండడంతో మావోయిస్టుల నివాసానికి దాన్ని సరైన ప్రాంతంగా ఎంచుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారని.. దీనిపై ఎస్పీ అకింత్ గోయల్ కు రహస్య సమాచారం అందింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. అతి భయంకరమైన అటవీలోకి పోలీలుసు ప్రవేశించారు. వారి రాక విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు అలర్ట్ అయ్యి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు సైతం క్షణం ఆలస్యం చేయకుండా ఎదురుకాల్పులకు దిగారు. పోలీసులు - మావోయిస్టుల మధ్య గంటకుపైగానే కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Crime, Crime news, Crime story, Encounter, Maharashtra, Maoist, Maoists, Naxals, Police

    తదుపరి వార్తలు