నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదురుగు మృతి చెందారు.

news18-telugu
Updated: November 18, 2019, 2:02 PM IST
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం జానకంపేట్ నుండి తానకాలాన్ వెళ్లే మార్గ మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జానకంపేట్ గ్రామస్థులు కుర్నపల్లి అబ్బయ్య దర్గా వద్ద కందూర్‌కు వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎదురుగా వస్తున్న కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు జానకంపేట్ వాసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ప్రమాదాన్ని గమనించిన పలువురు స్థానికులు... బాధితులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో జానకంపేట్ గ్రామానికి చెందిన జక్కం గంగామణి, ఆకుల బాలమణి, చిక్కేల సాయిలు, కల్లెపురం సాయి చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నయిమ్ కూడా చికిత్స పొందుతూ మరణించాడు. ఒకే గ్రామానికి చెందిన వారు ఐదుగురు మరణించడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>