హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాకింగ్ న్యూస్.. భారత్‌కు వస్తుండగా కూలిన విమానం.. ఒకే కుటుంబానికి చెందిన..

షాకింగ్ న్యూస్.. భారత్‌కు వస్తుండగా కూలిన విమానం.. ఒకే కుటుంబానికి చెందిన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్ తన కుటుంబంతో కలిసి ఇండియాలో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో కలిసి బయలుదేరారు.

ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదాన్ని మరిచిపోకముందే.. మరో ప్రమాదం జరిగింది. తాజాగా అమెరికాలోని జార్జియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన నలుగురితో పాటు విమాన పైలెట్ ఘటనాస్థలంలోనే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్ తన కుటుంబంతో కలిసి ఇండియాలో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో జార్జియాలోని ఈటన్టన్‌‌ సమీపంలోకి రాగానే విమానం కుప్పకూలింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే విమానం నేలను తాకింది. అయితే ఈ విమానం కూలిపోతున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించారు. విమానం కూలడానికి ముందే ఆకాశంలోనే మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. విమాన ప్రమాదానికి ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను కారణం అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

First published:

Tags: America, Plane Crash

ఉత్తమ కథలు