హోమ్ /వార్తలు /క్రైమ్ /

పక్కా స్కెచ్ తో చిరుత పులిని పట్టేశారు.. కమ్మగా కూర వండుకుని తింటుండగా పోలీసుల ఎంట్రీతో..

పక్కా స్కెచ్ తో చిరుత పులిని పట్టేశారు.. కమ్మగా కూర వండుకుని తింటుండగా పోలీసుల ఎంట్రీతో..

100 మీటర్ల ప్రైవేటు భూమిలో వలను వేశాడు. చిరుత పులి పొరపాటున ఆ భూమిలోకి వస్తే మళ్లీ తిరిగి వెళ్లలేనంతగా ఏర్పాట్లు చేశాడు. అయితే అనుకోకుండా ఈ బుధవారం ఉదయం ఓ ఆరేళ్ల వయసున్న చిరుత పులి వినోద్ పన్నిన వలలో చిక్కుకుంది. దాన్ని చంపి, కూర వండుకుని తింటుండగా..

ఇంకా చదవండి ...

  కేరళలో ఘోరం జరిగింది. ఓ చిరుత పులిని వేటాడి పట్టుకుని చంపేశారు. అంతేకాకుండా దాని మాంసంతో కూర వండుకుని మరీ తిన్నారు. విషయం తెలిసిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కటకటాల్లోకి నెట్టారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి పరిధిలోని మన్కులం ఫారెస్ట్ డివిజన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మన్కులంకు చెందిన 45 ఏళ్ల కొల్లికోలవిల్ వినోద్ పీకే, 74 ఏళ్ల బసీల్ గార్డెన్ వీపీ కురికోస్, 50 ఏళ్ల చెంపెంపురయిదతిల్ సీఎస్ బిను, 54 ఏళ్ల మలయిల్ సాయి కుంజప్పన్, 50 ఏళ్ల వడక్కుమచలిల్ విన్సెంట్ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్లు. వీరు అప్పుడప్పుడు అడవుల్లో పందులను వేటాడి, దాని మాంసాన్ని తినేవాళ్లు. అయితే మొదటిసారి ఓ చిరుతపులిపై వినోద్ దృష్టి పడింది.

  ఇడుక్కిలోని మంకులం ప్రాంతంలో మునిపురా వద్ద ఓ 100 మీటర్ల ప్రైవేటు భూమిలో వలను వేశాడు. చిరుత పులి పొరపాటున ఆ భూమిలోకి వస్తే మళ్లీ తిరిగి వెళ్లలేనంతగా ఏర్పాట్లు చేశాడు. అయితే అనుకోకుండా ఈ బుధవారం ఉదయం ఓ ఆరేళ్ల వయసున్న చిరుత పులి వినోద్ పన్నిన వలలో చిక్కుకుంది. అంతే దాన్ని వెంటనే తాను ఉంటున్న భవనంలోకి వినోద్ తీసుకెళ్లాడు. పదునైన ఆయుధాలతో ఆ చిరుత పులిని చంపేశాడు. ఆ తర్వాత తన మిత్రులను పిలిచాడు. వారు వచ్చి మొదట షాకైనా, చిరుత పులి మాంసాన్ని తినొచ్చన్న ఆశతో వారు అతడికి సహకరించారు.

  ఆ చిరుత పులిని కోసి, మాంసాన్ని వేరు చేసి కూర వండుకున్నారు. వీరు చేస్తున్న నిర్వాకానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు అందించారు. అంతే వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చిరుత పులి మాంసం కూరతో భోజనం చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. చిరుత పులి పళ్లు, చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. పది కేజీల చిరుత పులి మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులకు వేటాడటం ఓ సరదా అనీ, గతంలో పందులను వేటాడారు కానీ చిరుత పులిని పట్టుకోవడం మాత్రం ఇదే ప్రథమమని పోలీసుల విచారణలో తేలింది. చిరుత పులిని వేటాడి చంపినందుకు వినోద్ పై, చిరుత పులి మాంసాన్ని తిన్నందుకు మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  First published:

  Tags: Forest, Leopard attack, Leopard attack dog, Tiger Attack

  ఉత్తమ కథలు