Home /News /crime /

FIVE ACCUSED ARRESTED FOR GANG RAPE OF MOTHER AND DAUGHTER IN HARIDWAR UTTARAKHAND SNR

Uttarakhand: కారులో లిఫ్ట్‌ ఇచ్చి కదులుతుండగానే తల్లీ,ఆరేళ్ల కూతురిపై అత్యాచారం..వీళ్లే ఆ దుర్మార్గులు

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Gang rape: అర్దరాత్రి లిఫ్ట్ అడిగిన తల్లి,బిడ్డపై సామూహిక అత్యాచారం చేసిన కామాంధుల్ని హరిద్వార్ పోలీసులు పట్టుకున్నారు. వారం రోజుల క్రితం దారుణానికి పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న నిందితుల కోసం పోలీసులు అన్నీ వైపుల గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇంకా చదవండి ...
  కదులుతున్న కారులో తల్లితో పాటు ఆమె ఆరేళ్ల కూతుమార్తెపై అత్యాచారం(Gang Rape) చేసిన కామాంధులను హరిద్వార్Haridwar పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరాఖండ్‌Uttarakhandలో ఆరు రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఐదుగురు దుర్మార్గులను(Five accused) బాధితురాలు ఇచ్చిన క్లూస్ ఆధారంగా చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరిన్ని వివరాలు వాళ్ల ద్వారా కక్కిస్తున్నారు ఉత్తరాఖండ్ పోలీసులు.

  ఐదుగురు కామాంధులు అరెస్ట్..
  గత నెల 25వ తేదిన హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలో ఓ తల్లీ,బిడ్డ పాలిట నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు ఐదుగురు వ్యక్తులు. శుక్రవారం రాత్రి సమయంలో రూర్కీ నుంచి కలియార్ వెళ్లేందుకు ఓ కారుని లిఫ్ట్ అడిగిన తల్లీ బిడ్డను కారులో ఎక్కించుకొని అత్యాచారం చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసును చేధించేందుకు సుమారు 7-8 పోలీసు బృందాలు ఐదు రోజులుగా నిందితుల కోసం అన్వేషించాయి. సుమారు 150మంది అనుమానితుల్ని విచారించారు. నిందితుల ఫోన్‌ కాల్‌, కారు నెంబర్ ఆధారంగా దోషులను పట్టుకున్నట్లుగా ఎస్‌ఎస్‌పీ యోగేంద్రసింగ్‌ రావత్ తెలిపారు. సంఘటన జరిగిన గంట తర్వాత విషయం పోలీసులకు తెలియడంతో సమీపంలోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా తెలిపారు. అంతే కాదు చుట్టు పక్కల నివసిస్తున్న వారితో పాటు స్థానికుల ద్వారా సమాచారం రాబట్టినట్లు పోలీసులు తెలిపారు.  తల్లీ, బిడ్డపై అత్యాచారం..
  సరిగ్గా వారం రోజుల క్రితం గత శుక్రవారం అనగా జూన్‌ 25వ తేదిన రూర్కీ ప్రాంతంలో తల్లీ, బిడ్డ కలియార్ వెళ్లేందుకు నిల్చున్నారు. రాత్రి వేళ కావడంతో అటుగా వచ్చిన కారును లిఫ్ట్ అడిగారు. లిఫ్ట్ ఇచ్చిన కామాంధులు మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తె కారులో కూర్చోగానే డోర్ లాక్ చేసి కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారు. మొదట తల్లిని..అటుపై ఆరేళ్ల మైనర్ బాలికపై తమ కామవాంఛ తీర్చుకున్నారు దుర్మార్గులు. అనంతరం గంగా కెనాల్ సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశంలో వాళ్లిద్దరిని వదిలేసి కారులో పారిపోయారు. ఈఘటన జరిగిన గంట తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

  ఇది చదవండి: నేటి నుంచి ఇవి బంద్.. కాదంటే జైలుకు వెళ్లాల్సిందే..  నిందితుల కోసం ఐదు రోజులుగా వేట..
  బాధితురాలు భిక్షాటన చేసుకుంటూ బిడ్డను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితుల ఊహా చిత్రాలతో పాటు CCTV ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలకమైన ఆధారాలను రాబట్టారు. పోలీసులు సేకరించిన వివరాల ఆధారంగా ఐదుగురు నిందితుల్ని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి పేరు సోను అని బాధితురాలు చెప్పిన దాన్ని బట్టి నేరస్తుల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

  ఇది చదవండి : ఉదయ్ పూర్ హత్య..కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Gang rape, Uttarakhand

  తదుపరి వార్తలు