యువతిని లైంగికంగా వేధించిన ఫిట్‌నెస్ ట్రైనర్ అరెస్ట్...

Fitness trainer : ఆమె దగ్గరకు వచ్చిన పర్దేషీ... కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తే... టెక్నిక్స్ పాటిస్తే... ఈజీగా బరువు తగ్గవచ్చంటూ... ఇలా చెయ్యాలంటూ... ఆమెను పట్టుకున్నాడు. ఆమె మర్మాంగాలపై చేతులు వేస్తూ... ఇష్టారాజ్యంగా ప్రవర్తించసాగాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 17, 2019, 7:38 AM IST
యువతిని లైంగికంగా వేధించిన ఫిట్‌నెస్ ట్రైనర్ అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబైలోని టార్డియో పోలీసులు... ఓ ఫిట్‌నెస్ ట్రైనర్‌ను అరెస్టు చేశారు. బరువు తగ్గేందుకు తగిన సూచనలు చేస్తానంటూ... అతను 16 ఏళ్ల యువతిపై లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. మహాలక్ష్మీ రీకోర్స్‌లో... జాగింగ్ ట్రాక్‌పై యువతి జాగింగ్ చేస్తుండగా... ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. 29 ఏళ్ల ఫ్రీలాన్స్ పర్దేషీ... మహాలక్ష్మీ రీకోర్స్ ఫిట్‌నెస్ సెంటర్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చే కస్టమర్ల నుంచీ కొద్ది మొత్తం డబ్బు తీసుకొని... ఫిట్‌నెస్‌పై సలహాలూ, సూచనలూ ఇస్తుండేవాడు. తాజాగా ఉదయం ఆరున్నరకు 16 ఏళ్ల యువతి బరువు తగ్గేందుకు అక్కడకు వచ్చింది. ఇటీవలే ఆమె అందులో చేరింది. జాగింగ్ ట్రాక్‌పై జాగింగ్ చేయసాగింది. ఆమె దగ్గరకు వచ్చిన పర్దేషీ... కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తే... టెక్నిక్స్ పాటిస్తే... ఈజీగా బరువు తగ్గవచ్చంటూ... ఇలా చెయ్యాలంటూ... ఆమెను పట్టుకున్నాడు. ఆమె మర్మాంగాలపై చేతులు వేస్తూ... ఇష్టారాజ్యంగా ప్రవర్తించసాగాడు.

వెంటనే అలర్టైన ఆ యువతి... అతన్ని బలంగా వెనక్కు నెట్టింది. తనకు ఏ టెక్నిక్‌లూ అవసరం లేదంది. అంతే... ఆమె వైపు కోపంగా చూడసాగాడు. భయంభయంగా అక్కడి నుంచీ వెళ్లిపోయిన బాధితురాలు... ఇంటికి వెళ్లి పేరెంట్స్‌కి విషయం చెప్పింది. వాళ్లు యువతితో కలిసి సాయంత్రం పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా... పోస్కో చట్టం కింద కేసు రాసిన పోలీసులు... అతని కోసం ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లారు.

ఆ ఫిట్‌నెస్ సెంటర్‌లో చాలా మంది ట్రైనర్లు ఉన్నారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన పర్దేషీ... సిల్వర్ బ్రాస్‌లెట్ వేసుకున్నాడు. దాని ఆధారంగా అతన్ని గుర్తుపట్టిన పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 19 వరకూ అతన్ని పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>