ప్రేమ పెళ్లి.. ఎనిమిదేళ్లుగా అన్యోన్యంగా సంసారం.. సడన్‌గా భార్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త..!

రోడ్డుపై బైఠాయించిన సుధారాణి

నిజామాబాద్ జిల్లాకు చెందిన సుధారాణి, కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బాలరాజు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరికి ఒకరు తోడుగా ఉందామని బాసలు చేసుకున్నారు. ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ...

  • Share this:
    నిజామాబాద్: ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు.. 8 సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్నారు.. వీరికి ఏడు సంవత్సరాల పాప ఉంది. భార్య‌కు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య బిడ్డ‌తో క‌లిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ‘నాకు మా ఆయన కావాలి అంతకు మించి ఏమీ వద్దు’ అని అంటున్న మొద‌టి భార్య‌ దీన స్థితి గురించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

    నిజామాబాద్ జిల్లాకు చెందిన సుధారాణి, కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బాలరాజు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరికి ఒకరు తోడుగా ఉందామని బాసలు చేసుకున్నారు. ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నిజామాబాద్‌లోని కొట‌గ‌ల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని రెండు సంవత్సరాలు ఉన్నారు. ఆ త‌ర్వాత ఆర్యనగర్‌‌లో గత మూడు సంవత్సరాలుగా ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరికి ఏడు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే కరోనా కారణంగా వారు చేస్తున్న‌ జాబ్ పోవడంతో బాలరాజు మార్కెటింగ్ బాయ్‌గా పని చేస్తున్నాడు.

    గత నాలుగు నెలలుగా బాలరాజు ఇంటికి సరిగ్గా రావ‌డం లేదు. ఎందుకు రావ‌డం లేద‌ని భార్య అడిగితే ఏవేవో సాకులు చెబుతూ త‌ప్పించుకున్నాడు. రాత్రుళ్లు ఇంటికి రావ‌డం మానేశాడు. అయితే నాలుగు నెలల క్రితమే బాలరాజు రెండో పెళ్లి చేసుకున్నాడన్న విషయం జనవరి 2న భార్య సుధారాణికి తెలిసింది. బాలరాజుకు ఫోన్ చేసి రెండో పెళ్లి చేసుకున్నావా’? అని అడిగితే అవునని స‌మాధానం ఇచ్చాడు. దీంతో.. తన భవిష్యత్ ఏంటని మొద‌టి భార్య ప్ర‌శ్నించింది. పట్టించుకోకపోవడంతో భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

    బాలరాజు తనకు విడాకులు ఇస్తే ఒక ఎకరం భూమి ఇస్తానని చెప్పాడని.. కానీ తాను ఒంట‌రిగా ఉండ‌డంతో స‌రైన నిర్ణ‌యం తీసుకోలేక పోయానని బాధితురాలు తెలిపింది. తనకూ, తన కూతురికి తన భర్త అండగా ఉండాలని, తనకు ఎలాంటి ఆస్తులు అవసరం లేద‌ని బాధితురాలు కోరుతోంది. తమది ప్రేమ పెళ్లి కావడంతో పెళ్లి అయినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని.. ఆ కారణాన్ని అడ్డం పెట్టుకుని ‘నువ్వు నా భార్యవి కావు’ అని తన భర్త మాట్లాడుతున్నాడని సుధారాణి ఆవేదన వ్యక్తం చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published: