Home /News /crime /

FIRST WIFE HAS LODGED A COMPLAINT AGAINST HER HUSBAND WHO BROKE UP WITH HER AND RAN AWAY WITH ANOTHER WOMAN SSR

Government Teacher: గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఇదేం పని బాబూ.. ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడో చూడండి..

సెంథిల్ కుమార్

సెంథిల్ కుమార్

సెంథిల్ కుమార్ అనే ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కలితీర్థల్‌కుప్పం ప్రాంతానికి చెందిన మహేశ్వరి అనే మహిళ, ఇతను 16 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2006లో వీరికి వివాహమైంది.

ఇంకా చదవండి ...
    పుదుచ్చేరి: సెంథిల్ కుమార్ అనే ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కలితీర్థల్‌కుప్పం ప్రాంతానికి చెందిన మహేశ్వరి అనే మహిళ, ఇతను 16 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2006లో వీరికి వివాహమైంది. ప్రేమ పెళ్లి అయినప్పటికీ వరుడు గవర్నమెంట్ టీచర్ కావడంతో మహేశ్వరి తల్లిదండ్రులు భారీగా బంగారం, డబ్బు కట్నంగా ముట్టజెప్పారు. అంతేకాదు.. అల్లుడికి బైక్ కూడా కొనిచ్చారు. పెళ్లయిన కొన్నేళ్లు భార్యాభర్తలిద్దరూ బాగానే అన్యోన్యంగా ఉన్నారు.

    ఇది కూడా చదవండి: Friend Phone: ఫ్రెండ్ ఫోన్‌లో తన భార్య జరిపిన వాట్సాప్ చాట్ చూసిన భర్త.. చివరికి ఏం చేశాడంటే..

    పెళ్లయిన ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని మహేశ్వరి బాధపడుతుండేది. అయితే.. 2018లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతో.. పిల్లలు లేరన్న బాధ తీరిపోయింది. పాప పుట్టిన నాలుగేళ్ల తర్వాత భార్యాభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇద్దరూ చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే.. తను చదువు చెప్పే స్కూల్‌లో రేఖ అనే యువతితో సెంథిల్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ గురుశిష్యురాలు ఇద్దరూ బాగా దగ్గరయ్యారు.

    ఇది కూడా చదవండి: Husband: ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యను ఇంత ప్రేమగా చూసుకుంటున్న భర్తకు ఇలాంటి పరిస్థితా..

    ఎంతలా అంటే.. టెన్త్ పూర్తయ్యాక ఆమెను తన సొంత డబ్బులతో ఫీజు కట్టి మరీ సెంథిల్ చదివించాడు. ఆమె ప్రస్తుతం డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ యువతి వయసు ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇన్నాళ్లూ వయసు అడ్డంకిగా ఉండటంతో ఆగిన సెంథిల్ ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. కొన్ని రోజుల క్రితం భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడిన సెంథిల్ ఆమెకు విడాకుల నోటీసు పంపి తను ఇష్టపడిన రేఖతో వెళ్లిపోయాడు.

    ఇది కూడా చదవండి: Lovers: పదేళ్ల ప్రేమకు ఇదేం ముగింపు.. ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..

    ఈ పరిణామంతో షాకయిన సెంథిల్ భార్య మహేశ్వరి పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. తన పాపను ఎత్తుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. అయితే.. ఆమె ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.



    సెంథిల్ కుమార్ వ్యవహారంపై ఆరా తీయగా.. ఆ యువతి 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆమెతో సెంథిల్‌కు పరిచయం ఉందని తెలిసింది. ఆమెను తీసుకుని వెళ్లిపోయిన సెంథిల్ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. దీంతో.. తన పరిస్థితి ఏంటని మొదటి భార్య లబోదిబోమంటోంది. పాపను, భార్యను వదిలేసి మరో యువతితో వెళ్లిపోయిన ఈ ప్రబుద్ధుడిని కఠినంగా శిక్షించాలని ఈ విషయం తెలిసిన వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ ఉపాధ్యాయుడు, మాజీ విద్యార్థిని పెళ్లి వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Husband, Puducherry, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు