ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దిశా యాప్ ద్వారా తొలి సక్సెస్ నమోదయింది. బస్సుల్లో మహిళా అధికారిని వేధిస్తున్న కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. SOSకి ఫోన్ కాల్ వచ్చిన 6 నిమిషాల్లోనే ఆకతాయిని పట్టుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఓ మహిళా అధికారి విశాఖ నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా.. తోటి ప్రయాణికుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవలే ప్రభుత్వం లాంచ్ చేసిన దిశా యాప్ గుర్తొచ్చి.. ఆమె వెంటనే SOS ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.
ఉదయం 04.21 నిమిషాలకు మంగళగిరి దిశా కాల్ సెంటర్కు sos కాల్ వెళ్లింది. అక్కడి నుంచి కాల్ సెంటర్ ద్వారా దగ్గర్లోని ఎమర్జెన్సీ సెంటర్కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాలకు బాధితురాలి వద్దకు చేరుకున్నారు. నేరుగా బస్సులోకి వెళ్లి వేధింపుల పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ప్రొఫెసర్గా గుర్తించారు. సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను సీఎం జగన్ అభినందించారు. కాగా, మహిళలు-బాలికల రక్షణ కోసం దిశా చట్టం తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇటీవలే దిశా పోలిస్ స్టేషన్లను సైతం ప్రారంభించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Crime news, Disha App, Vijayawada