కడప జిల్లా పులివెందులలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ ఘర్షణ సందర్భంగా నిందితుడు తుపాకీతో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ బాషా అనే వ్యక్తులు గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో దిలీప్ అనే వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ మరో వ్యక్తి భాషా ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకువచ్చిన భరత కుమార్ యాదవ్.. బాధితులపై కాల్పులు జరిపాడు.
కాల్పుల్లో గాయపడిన మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడారు. భరత్ కుమార్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్చాడని వెల్లడించాడు. ఇక కాల్పుల ఘటనలో నిందితుడైన భరత్ కుమార్ యాదవ్‌ను గతంలో వివేకా హత్యకేసులో సీబీఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ కుమార్ యాదవ్‌కు భరత్ కుమార్ యాదవ్ సమీప బంధువు అని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Pulivendula