హోమ్ /వార్తలు /క్రైమ్ /

Misfire : రూ 4 వేలకోసం వాగ్వావాదం, తండ్రి కాల్పులు.. కొడుకు తలలోకి బుల్లెట్..

Misfire : రూ 4 వేలకోసం వాగ్వావాదం, తండ్రి కాల్పులు.. కొడుకు తలలోకి బుల్లెట్..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Misfire : నాలుగు వేల కోసం ఇద్దరు కార్మికులపై కాల్పులు జరిపాడు ఓ కార్గో సర్వీస్ ఓనర్.. తన భార్యతో వాగ్వాదం పెట్టుకుంటారా అంటూ లారీ డ్రైవర్ మరియు క్లీనర్ పై లైసన్స్‌డ్ తుపాకితో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు అయితే అందులో ఒకటి మిస్‌ఫైర్ అయి.. తన కొడుకు తలలోకి దూసుకువెళ్లింది.

ఇంకా చదవండి ...

  సినిమాల్లో చాలా సీన్లు చూసే ఉంటాము.. ఇద్దరి మధ్య ఘర్షణలో విలన్ శత్రువులను కాల్చితే గురి తప్పి తన సొంత కుటుంబీకులకే గాయాలు కావడం జరుగుతుంది. అయతే నిజజీవితంలో కూడా అచ్చు ఇలాంటీ సంఘటన జరిగింది. లైసెన్స్‌డ్ తుపాకి ఉందని పని చేసే కార్మికులపై ఓ యజమాని తుపాకి ఎక్కుపెట్టాడు. అయితే మిస్ ఫైర్ అయి తన కొడుకు తాకడంతో పాటు తాను కూడా చాతి నొప్పితో ఆసుపత్రి పాలు అయిన సంఘటన కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ( karnataka ) మంగళూర్‌లో రాజేశ్ అనే వ్యక్తి వైష్ణవి ఎక్స్‌ప్రెస్ కార్గో అనే పేరుతో ట్రాన్స్‌పోర్టు సర్వీసు వ్యాపారం ( business ) చేస్తున్నాడు. అయితే ఇటివల తన వద్ద పనిచేసే డ్రైవర్ ఆశ్రఫ్‌, క్లీనర్ చంద్రలు కలిసి ముంబయికి వెళ్లి వచ్చారు. ఇందుకోసం తమకు నాలుగు వేల రూపాయలు ( four thousand ) ఇవ్వాలని ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఉండే రాజేశ్ భార్య శాంతలను డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం (altercation) చోటు చేసుకుంది.

  ఇది చదవండి :  భార్యపై అనుమానం, బర్రెను వెతుకుదామంటూ తీసుకువెళ్లి.. బురదలో తొక్కాడు.. !

  దీంతో శాంతలా పక్కనే నివాసం ఉంటున్న తన భర్త రాజేశ్‌తో పాటు తన కొడుకు సుదేంద్ర‌లకు ఫోన్ (phone ) చేసి ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి పిలిపించింది. ఈ క్రమంలోనే వారు అక్కడికి చేరుకున్నారు. తర్వాత వారితో కూడా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే రాజేశ్ కొడుకు సుదేంద్ర ఇద్దరు కార్మికులను చెంపదెబ్బలు ( slapped ) కొట్టాడు. వారిపై ఉమ్మివేస్తూ (spat) దుర్భాషలాడాడు. ఇదంతా చూస్తున్న రాజేష్‌కు సైతం మరింత కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే తన లైసెన్స్‌డ్ తుపాకితో డ్రైవర్ , క్లీనర్‌పై కాల్పులు జరిపాడు.

  ఇది చదవండి :   బాసరలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

  రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడి నుండి పారిపోయె ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కాల్పులు మిస్ ఫైర్ అయ్యాయి.. పక్కనే ఉన్న తన కొడుకు సుదేంద్ర ఎడమ కంటి పై బాగం నుండి తలలోకి ( head ) దూసుకువెళ్లింది. దీంతో సుదేంద్రను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుదేంద్ర పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు స్థానిక పోలీసు కమిషనర్ ఎన్‌ శశికుమార్ తెలిపారు. మరోవైపు కాల్పులు జరిపిన రాజేశ్‌కు సైతం చాతినొప్పి రావడంతో ఆయన్ను కూడా అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ( treatment ) అందిస్తున్నారు.

  కాల్పులు జరిపిన రాజేశ్‌పై పలు సెక్షెన్ల క్రింద కేసు నమోదు చేశారు. లైసెన్స్‌డు గన్ అయినప్పటికి హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Gun fire, Karnataka

  ఉత్తమ కథలు