ఒక్కసారిగా 30 మంది మావోయిస్టులు..తర్వాత ఏం జరిగిందంటే..

చనిపోయిన మావోయిస్టును పశ్చిమ బస్తర్ ఏరియా కమిటీ కమాండర్‌గా గుర్తించారు. ప్రభుత్వం గతంలో ఆశుపై రూ.8 లక్షల రివార్డును ప్రకటించింది.

news18-telugu
Updated: April 19, 2020, 4:09 PM IST
ఒక్కసారిగా 30 మంది మావోయిస్టులు..తర్వాత ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లో గత కొద్ది రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న కాల్పులతో భయానక వాతవరణం నెలకొంటుంది. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంద్రిపాల్-ఏటిపాల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నాం సీఆర్‌పీఎఫ్ జవాన్లు, డీఆర్జీ దళాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా 30 మంది మావోయిస్టులు దళాలపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సోడి ఆశు(30) అనే మావోయిస్టు చనిపోయాడు. పోలీసులకు ఘటనాస్థలంలో కొన్ని ఆయుధాలు దొరికాయి.

చనిపోయిన మావోయిస్టును పశ్చిమ బస్తర్ ఏరియా కమిటీ కమాండర్‌గా గుర్తించారు. ప్రభుత్వం గతంలో ఆశుపై రూ.8 లక్షల రివార్డును ప్రకటించింది. బైరాంగడ్ ఏరియా కమిటీ మావోయిస్టు అగ్రనేత చంద్రన్న నాయకత్వంలో మావోయిస్టులు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. రాజ్‌నంద్‌గావ్ జిల్లా బుకమరకా అటవీ ప్రాంతంలోని పుగదా గ్రామ సమీపంలో కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దీనికి ఆగ్రహించిన మావోయిస్టులు శుక్రవారం రాత్రి రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన ఎనిమిది వాహనాలపై పెట్రోలు పోసి తగలబెట్టారు.
Published by: Narsimha Badhini
First published: April 19, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading