హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Incident : జమ్మూలో భారీ పేలుడు..నలుగురు మృతి,15మందికి తీవ్ర గాయాలు

Fire Incident : జమ్మూలో భారీ పేలుడు..నలుగురు మృతి,15మందికి తీవ్ర గాయాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Blast In Jammu : ఈ ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు చనిపోగా..15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Blast In Jammu : జమ్మూ​లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 6:15 గంటల సమయంలో రెసిడెన్సీ రోడ్డులోని ఓ బిల్డిండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఓ వ్యర్థాల దుకాణంలో(Scrap Shop)మంటలు చెలరేగాయి. మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. షాపు లోపల ఉంచిన కొన్ని ఎల్‌పిజి సిలిండర్లు పేలాయని జమ్మూ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ చందన్ కోహ్లీ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆ ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడం కారణంగా స్థానికులు భయాందోళనకు గుర్యయారు. షాట్​ సర్క్యూట్​ కారణంగా ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు చనిపోగా..15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నవారిలో చాలామంది అసోం రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పిన ఎక్స్​గ్రేషియా ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్​ మనోజ్​ సిన్హా. తీవ్ర గాయాలైన వారికి లక్ష రూపాయిలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

First published:

Tags: 15 injured, BLAST, Jammu, LPG Cylinder

ఉత్తమ కథలు