Fire that broke out at a chemical factory: గుజరాత్ లోని అహ్మద్ నగర్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. నిముషాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంత మంతా దట్టమైన పోగలు వ్యాపించాయి. శ్రీరాంపూర్ లోని ఎంఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఫ్యాక్టరీ సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బందిని బయటకు పంపించి వేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోనికి తీసుకువస్తున్నారు.
ఆ ప్రాంత మంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో రసాయనాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి ప్రజలను దూరంగా పంపించి వేశారు. అంబూలెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Correction | #WATCH Maharashtra*: A fire that broke out at a chemical factory in MIDC Shrirampur, Ahmednagar has been brought under control. No casualties reported so far: Official of Shrirampur Fire Department
(Video courtesy: Fire Department) pic.twitter.com/EtvbDGE88f
— ANI (@ANI) March 28, 2022
మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోనికి వస్తున్నట్లు సమాచారం. మంటలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణమా.. లేక మరేదైన కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ లో కూడా కొన్ని రోజుల క్రితమే అగ్ని ప్రమాదం జరిగింది. దాని వివరాలు..
హైదరాబాద్లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది. సికింద్రాబాద్లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Gujarat news