Fire tragedy 13 Injured in Cylinder Blast in Delhi: ఢిల్లీలోని జామియా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక అపార్ట్ మెంట్ లో ఉన్న సిలిండర్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు ఒక్కసారిరా ఉలిక్కి పడ్డారు. చూస్తుండగానే దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత.. వారు భయంతో బైటకు పరుగులు పెట్టారు.
బేస్ మెంట్ లో ఉన్న వస్తువులు అన్ని చెల్లా చెదురుగా విసిరివేయబడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్ లతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిని వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
A gas cylinder explosion occurred at a fast-food restaurant in Jamia area of South East Delhi, 13 people injured. Fire tenders rushed to the spot. Injured admitted to Holy Family Hospital: Delhi Fire officials
— ANI (@ANI) April 14, 2022
గతంలో మధ్య ప్రదేశ్ లో బాణాసంచా యూనిట్ లో పేలుడు సంభవించింది.
Explosion At Illegal Madhya Pradesh Firecracker Unit: మధ్య ప్రదేశ్ లోని శివపురి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమేలా ప్రాంతంలో టపాకాయాలను తయారు చేసే యూనిట్ లో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పేలుడు జరిగిన(Fire Explosion) ప్రదేశంలో ఒక మహిళ,ఆమె కుమార్తె మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. శివపురి జిల్లాకు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బదర్వాస్ పట్టణంలో మధ్యాహ్నం ఘటన జరిగింది.
మహ్మద్ హుస్సేన్ అన్సారీకి చెందిన రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనపై వద్ద ఫైరింజన్ లతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. పేలుగు సంభవించగానే.. తబస్సుమ్ ఖాన్ (25), ఆమె కుమార్తె ఉమేరా (11) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడులో (Firecracker Unit) గాయపడిన.. అన్సారీ కుటుంబ సభ్యులు, మరి కొంతమంది కార్మికులను స్థానికులు శివపురి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. అన్సారీ సుమేలా గ్రామంలో బాణసంచా యూనిట్ (Firecracker Unit) నడుపుతున్నందుకు లైసెన్స్ కలిగి ఉన్నాడు. కానీ బదర్వాస్లోని నివాస ప్రాంతంలో అక్రమంగా మరో యూనిట్ నడుపుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Fire Accident