Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆకతాయిలు చేసిన పనికి.. శేషాచలంలో వంద ఎకరాలకు పైగా..

ఆకతాయిలు చేసిన పనికి.. శేషాచలంలో వంద ఎకరాలకు పైగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకతాయిలు గురువారం ఉదయం నిప్పుపెట్టడంతో వంద ఎకరాలకు పైగా తగలబడిపోయింది.

కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి శేషాచలం అడవుల్లో వంద ఎకరాలకు పైగా మంటలంటుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతి నగర సమీపం టీఎన్ పాలెం బీటు పరిధి జీవకోన సమీపంలోని అటవీ ప్రాంతానికి కొంతమంది ఆకతాయిలు గురువారం ఉదయం వెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతానికి ఆ ఆకతాయిలు నిప్పుపెట్టారు. మంటలు దావానంలా వ్యాపించి వంద ఎకరాలకు పైగా మంటలంటుకున్నాయి. చూస్తుండగానే ఎకరాలకు ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పడిన మంటలను ఆర్పేందుు అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

First published:

Tags: Fire Accident, Tirumala news, Ttd

ఉత్తమ కథలు