హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Accident: కరోనా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం... నలుగురు మృతి, మరి కొందరి పరిస్థితి విషమం

Fire Accident: కరోనా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం... నలుగురు మృతి, మరి కొందరి పరిస్థితి విషమం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fire Accident in Covid-19 Hospital at Nagpur: నాగపూర్ లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

అసలే కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. 27 మంది పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమి చెప్పలేమని పోలీసులు తెలపడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలోని ఏసీ యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా తొలుతగా మంటలు వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సెకండ్ ఫ్లోర్ లోని ఐసీయూలో మొదలైన మంటలు క్రమేపి ఆ ఫ్లోర్ అంతా విస్తరించాయి. అయితే ఇతర ఫ్లోర్ లకు మంటలు వ్యాపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో నలుగు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషయంగా మారింది.

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన పేషెంట్లను సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. వెంటనే వారికి చికత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఈ ఘటనతో మహారాష్ట్ర వాసులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. నాగపూర్ లో జరిగిన అగ్నప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ కీలక నేత దేవెంద్ర ఫడ్నవీస్ ఈ ఘటన విషయమై ట్వీట్ చేశారు. నాగపూర్ లోని ఆస్పత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం బాధ కలిగించిందన్నారు. ఈ విషయమై నాగపూర్ కలెక్టర్ తో మాట్లాడినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

First published:

Tags: Corona, Covid-19, Fire Accident, Maharashtra

ఉత్తమ కథలు